Viral Video: ఈ 9 ఏళ్ల చిన్నారి కుంగ్ కుంగ్ ఫూ స్టార్.. రబ్బర్ లా శరీరాన్ని తిప్పేస్తున్న బాలిక.. వీడియో వైరల్

|

Aug 10, 2024 | 9:08 AM

ఈ సంవత్సరం 124 మంది కుంగ్ ఫూ అభ్యాసకులతో కూడిన అంతర్జాతీయ బృందం సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని షావోలిన్ ఆలయానికి గౌరవనీయమైన కుంగ్ ఫూ మాస్టర్లను ప్రేక్షకుల ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఆహ్వానించారు. వారిలో ఈ 9 ఏళ్ల అమ్మాయి తన శరీరాన్ని అద్భుతంగా వంచుతూ ఆశ్చర్యకరమైన రీతిలో భంగిమలు చేస్తూ న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన ప్రదర్శనతో బాలిక షావోలిన్ కుంగ్ ఫూ స్టార్ టైటిల్ ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ 9 ఏళ్ల చిన్నారి కుంగ్ కుంగ్ ఫూ స్టార్.. రబ్బర్ లా శరీరాన్ని తిప్పేస్తున్న బాలిక.. వీడియో వైరల్
Viral Video
Follow us on

పిట్ట కొంచెం కూత ఘనం అనొచ్చు ఈ చైనీస్ చిన్నారిని చూస్తే.. 9 ఏళ్ల చైనీస్ అమ్మాయి సోషల్ మీడియాలో భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో నివాసం ఉంటున్న అమ్మాయి పేరు జాంగ్ సిక్సువాన్. ఈ చిన్నారి బాలిక ప్రపంచ షావోలిన్ గేమ్స్ కోసం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కుంగ్ ఫూ మాస్టర్స్‌ను ఓడించి ‘షావోలిన్ కుంగ్ ఫూ స్టార్’ టైటిల్‌ను గెలుచుకుంది. వైరల్ క్లిప్‌లో అమ్మాయి చేసిన విన్యాసాలు చూస్తే ఎవరినా షాక్ అవ్వాల్సిందే..

ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా షావోలిన్ కుంగ్ ఫూ అభ్యాసకులు మిలియన్ల మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ షావోలిన్ ఛాంపియన్‌షిప్‌లలో వేలాది మంది పాల్గొంటారు. ఈ సంవత్సరం 124 మంది కుంగ్ ఫూ అభ్యాసకులతో కూడిన అంతర్జాతీయ బృందం సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని షావోలిన్ ఆలయానికి గౌరవనీయమైన కుంగ్ ఫూ మాస్టర్లను ప్రేక్షకుల ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఆహ్వానించారు. వారిలో ఈ 9 ఏళ్ల అమ్మాయి తన శరీరాన్ని అద్భుతంగా వంచుతూ ఆశ్చర్యకరమైన రీతిలో భంగిమలు చేస్తూ న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన ప్రదర్శనతో బాలిక షావోలిన్ కుంగ్ ఫూ స్టార్ టైటిల్ ను సొంతం చేసుకుంది.

నివేదిక ప్రకారం ప్రపంచ షావోలిన్ గేమ్స్‌కు అర్హత సాధించిన 124 మంది కుంగ్ ఫూ అభ్యాసకులలో.. కేవలం 10 మంది మాత్రమే షావోలిన్ కుంగ్ ఫూ స్టార్ టైటిల్‌ను సాధించారు. వీరిలో జాంగ్ సిక్సువాన్ సాధించిన ఘనత అసాధారణమైనది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

 

 

జాంగ్ కోచ్ జావో జెన్‌వు మాట్లాడుతూ.. చిన్నారి గత నాలుగు సంవత్సరాలుగా కుంగ్ ఫూ నేర్చుకుంటోందని.. రోజు రోజుకీ తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుందని చెప్పారు. కోచ్ తన శిష్యురలిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అర్థరాత్రి వరకు శిక్షణ ఇచ్చినా ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని చెప్పాడు. జాంగ్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..