ప్రపంచంలో వింతలకు కొదవే లేదు. ప్రకృతిపరమైన వింతలు ఒక ఎత్తైతే.. టెక్నికల్ మెస్మరైజ్‌లు మరో ఎత్తు. గ్రాఫిక్స్ వండర్స్ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ గ్రాఫిక్ వండర్ విజువల్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. నెటిజన్లు ఈ అద్భుతాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన గ్రాఫిక్ ఆఫ్టికల్ ఇల్యూషన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో రెండు విజువల్స్ అయ్యింది. పై భాగంలో వృత్తాకారంలో తిరుగుతున్నట్లుగా విజువల్ ఉండగా.. కింది భాగంలో అందమైన పెయింటింగ్ ఉంది.
ఈ వృత్తాకార విజువల్‌ను ఒక 10 సెకన్లపాటు తదేకంగా చూసి.. ఆ తరువాత కింది భాగంలో ఉన్న పెయింటింగ్‌ను చూడాలి. ఆ క్షణంలో అద్భుతమైన విజువల్ కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్న పెయింటింగ్ కదులుతున్నట్లుగా, అందులో విచిత్ర ఆకారం కూడా కనిపిస్తుంటుంది. చాలామంది నెటిజన్లు దీనిని ట్రై చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ట్రై చేయండి..
Stare at the white dot for 10 seconds, then look at Van Gogh’s Starry Night pic.twitter.com/WaHY4vrUNJ
— Vala Afshar (@ValaAfshar) June 16, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..