AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అమ్మ బాబోయ్.. మెట్రో ట్రైన్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా? చూస్తే మైండ్ బ్లాంకే..

ప్రజలు మెట్రో ట్రైన్ ఎందుకు ఎక్కుతారు? ఇదేం ప్రశ్న.. ప్రయాణం కోసం ఎక్కుతారు.. ఆ మాత్రం తెలియదా? అని అంటారా? అయితే, ఇది చూస్తే మాత్రం మేం అడిగిన ప్రశ్న సరైనదే అంటారు. అవును, మరి.. కొందరు తెలివైన వాళ్లు..

Watch Video: అమ్మ బాబోయ్.. మెట్రో ట్రైన్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా? చూస్తే మైండ్ బ్లాంకే..
Delhi Metro
Shiva Prajapati
|

Updated on: Jun 18, 2023 | 5:55 PM

Share

ప్రజలు మెట్రో ట్రైన్ ఎందుకు ఎక్కుతారు? ఇదేం ప్రశ్న.. ప్రయాణం కోసం ఎక్కుతారు.. ఆ మాత్రం తెలియదా? అని అంటారా? అయితే, ఇది చూస్తే మాత్రం మేం అడిగిన ప్రశ్న సరైనదే అంటారు. అవును, మరి.. కొందరు తెలివైన వాళ్లు.. మెట్రో ట్రైన్‌ను సైతం తమ అనుకూలంగా వినియోగించుకోగలరు. ఓ అమ్మాయి ఇదే విషయాన్ని నిరూపించింది. ఆ అమ్మాయి చేసిన పని చూసి తోటి ప్రయాణికులు, నెటిజన్లు అవాక్కై నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ అమ్మాయి మెట్రో ట్రైన్‌లో ఏం చేసింది? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో మెట్రో ట్రైన్‌లో యువతీ, యువకుల అసభ్య ప్రవర్తనకు సంబంధించి వార్తలు బాగా వస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేయడం వంటివి కూడా చూస్తున్నాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం మాత్రం అంతకు మించి అని చెప్పాల్సిందే. సాధారణంగా అమ్మాయిలు, మహిళలు తమ అందంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఇక కేశాలంకరణ విషయంలో నిత్యం అలర్ట్‌గా ఉంటారు. ఇంట్లోనే కాదు.. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మేకప్‌ బాక్స్ ఓపెన్ చేసేస్తారు. తాజాగా ఓ అమ్మాయి మెట్రో ట్రైన్‌లో అదే పని చేసింది. టైమ్ లేకనో, మరే కారణమో గానీ.. ఆ అమ్మాయి హెయిర్ స్ట్రెయిటెనర్‌ను యూజ్ చేసి తన జుట్టును సరి చేసుకుంది. మెట్రో ట్రైన్‌లో ఉండే ఛార్జింగ్ కేస్‌కు హెయిర్ స్ట్రెయిటెనర్‌ ప్లగ్ ఇన్‌‌సర్ట్ చేసింది. ఆ స్ట్రెయిటెనర్‌తో తన జుట్టును సెట్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి

అయితే, యువతి అలా చేసుకుంటుండగా తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ప్రశాంత్ కుమార్ అనే యూజర్ పోస్ట్ చేశారు. ‘ఢిల్లీ మెట్రో చాలా ప్రత్యేకమైనది’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఎందుకంటే.. దేశంలో ఏ మెట్రో ట్రైన్‌లో చోటు చేసుకోని ఘటనలు, పరిణామాలు అన్నీ ఢిల్లీ మెట్రోలోనే కనిపిస్తాయి. అయితే, ఈ వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అమ్మాయికి ఏ ప్లేస్‌నీ వదిలిపెట్టరని, ఛాన్స్‌ దొరికితే మేకప్ కిట్ ఓపెన్ చేసేస్తారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు