ఇప్పటి వరకు డిఫరెంట్ డ్యాన్స్‌లు చూసి ఉంటాం..బెల్లీ డ్యాన్స్ వంటి రకరకల డ్యాన్స్‌లు చూసి ఉంటాం.. అలాగే పలువురు ప్రముఖలు మూన్ వాక్ చేసి ఉండడాన్ని కూడా ఉంటాం.. కానీ ఒక్క హిప్పో డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూసి అంటారా.. ప్రస్తుతం హిప్పోకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
థాయ్‌లాండ్‌లో మూ డెంగ్ అనే ఆడ పిగ్మీ హిప్పోపొటమస్ ఉంది. దాన్ని వయస్సు రెండు నెలలు ఉంటుంది. ఈ మూ డెంగ్ చేసిన మూన్ వాక్ అందరీ దృష్టిని ఆకర్షించింది. ఈ పిగ్మీ బుజ్జి బుజ్జి అడుగులు వేయడాన్ని అక్కడికి వచ్చిన సందర్శకులు వీడియోలు తీశారు. దీంతో అవీ నెటింట్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీనిపైన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Whoa stop everything….Moo Deng doing the moonwalk 🤣 pic.twitter.com/vVKmXfIADN
— Wu Tang is for the Children (@WUTangKids) October 1, 2024
“హిప్పోలు డ్యాన్స్ చేస్తాయా? మూ డెంగ్ ఒక సూపర్ స్టార్!”అని ఒక్కరు కామెంట్ చేశారు. త్వరలో మూ డెంగ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను స్థాపించబోతున్నట్లు మరొకరు కామెంట్ చేశాడు.ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంచనా ప్రకారం కేవలం 2,000 నుండి 2,500 పిగ్మీ హిప్పోలు మాత్రమే అడవిలో మిగిలి ఉన్నాయి. వాటి దీర్ఘకాలిక మనుగడ గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమ ఆఫ్రికాకు చెందిన పిగ్మీ హిప్పోలు ప్రస్తుతం లాగింగ్, మైనింగ్, వేట వంటి మానవ కార్యకలాపాల కారణంగా బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి.