Watch: జీవితమంటేనే పోరాటం .. ఈ ఏనుగును చూస్తే మీరు అదే అంటారు.. కాలు లేకపోయినా..

|

Mar 14, 2023 | 3:49 PM

వీడియోలోని ఆ దృశ్యం నిజంగా హృదయవిదారకం. ఒక కాలు లేకపోయినప్పటికీ తన సమూహంతో సాధారణ జీవితాన్ని గడపాలనే సంకల్పంతో ఆ గజరాజు చేసిన పని..

Watch: జీవితమంటేనే పోరాటం .. ఈ ఏనుగును చూస్తే మీరు అదే అంటారు.. కాలు లేకపోయినా..
Three Legged Elephant
Follow us on

కొన్నిసార్లు జంతువులకు మనుషుల కంటే ఎక్కువ తెలివితేటలు, పోరాట పటిమ ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో అది నిజమని నిరూపిస్తోంది. ఈ వీడియో దక్షిణాఫ్రికాలోని సుకా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో కంటెంట్ సృష్టికర్త అయిన డైలాన్ పోన్స్ రికార్డ్‌ చేసిన షేర్‌ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హృదయాన్ని కదిలించే ఈ వీడియోలో మూడు కాళ్ళు ఉన్న ఏనుగు అడవిలో సంచిరిస్తోంది. డైలాన్ పోన్స్ వీడియోతో పాటుగా ఉన్న క్యాప్షన్‌లో ఏనుగును వుటోమిగా అభివర్ణించారు. వీడియోలో వుటోమీ తన మూడు కాళ్లతో కింద పడకుండా అతి కష్టం మీద.. ముందుకు వెళుతున్న ఏనుగుల మంద వైపు నడుస్తుంది. కేవలం సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని ఒక్కసారి చూసిన వారు మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

క్రుగర్ నేషనల్ పార్క్‌లోని న్జెమని డ్యామ్ దగ్గర కనిపించింది ఈ దృశ్యం. వుటోమీ వెనుక కాలు లేదు. ఏదైనా ప్రమాదంలోనో లేదా ఏవరైనా వేటగాడి వల్ల ప్రమాదం జరిగి ఏనుగు కాలు కోల్పోయి ఉండవచ్చని పోన్స్ తన నోట్‌లో పేర్కొన్నారు. వీడియోలోని ఆ దృశ్యం నిజంగా హృదయవిదారకం. ఒక కాలు లేకపోయినప్పటికీ తన సమూహంతో సాధారణ జీవితాన్ని గడపాలనే వుటోమి సంకల్పాన్ని చూసి మనుషులమైన మనం కూడా ఎంతో నేర్చుకోవాలని అతను చెప్పాడు.

ఇవి కూడా చదవండి

వుటోమి ఇతర ఏనుగులతో కలిసి నడవడం, మొత్తం మంద దానికి ఆలింగనం చేసుకోవడం, ఆ ఏనుగుకు మద్దతు ఇవ్వడం అతనికి అద్భుతమైన సానుభూతి, కరుణను కలిగించిందని అతను నోట్‌లో పేర్కొన్నాడు. వుటోమి వంటి జంతువులు ఇంకా అడవిలో ఉండవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తూ అతను తన ట్విట్‌ని ముగించాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..