Viral Photo: మనసుంటే మార్గం ఉంటుంది.. ఫన్నీ ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహేంద్ర..

|

May 06, 2022 | 1:34 PM

Viral Photo: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన మెచ్చిన.. పోస్టులను షేర్ చేస్తూ..

Viral Photo: మనసుంటే మార్గం ఉంటుంది.. ఫన్నీ ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహేంద్ర..
Anand Mahindra New Post
Follow us on

Viral Photo: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన మెచ్చిన.. పోస్టులను షేర్ చేస్తూ.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల్లో నివసించే సామాన్యులు తమ ప్రతిభను చూపిస్తే వారి గురించి తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. పదిమందికి వారి గురించి వారి గొప్పతనం ప్రతిభ గురించి పదిమందికి తెలిసేలా చేస్తారు.  ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం   చర్చనీయాంశంగా మారింది. ఆ ఫోటో చూసిన ఎవరైనా అంటారు.. ఆనంద్ మహీంద్ర నిజంగా అద్భుతమైన వ్యక్తిత్వం కలవారని. ఈ ఫోటోను షేర్ చేసిన అనంతరం నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ చిత్రంలో.. తోపుడు బండి పై ఓ కారు ఉంచారు. అయితే ఆ కారు మహీంద్రా కంపెనీది కావడం విశేషం. ఈ చిత్రాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్‌తో పంచుకుంటూ, ఆనంద్ మహీద్రా..  ‘ఈ చిత్రాన్ని నా స్నేహితుడు పంపారు. మహీంద్రా ఎలాగైనా అభివృద్ధిపథంలో ముందుకెళ్తుంది అని నా స్నేహితుడు కామెంట్ చేశారు. నేను నా స్నేహితుడు చేసిన కామెంట్స్ ను పాజిటివ్‌గా తీసుకున్నాను. మనం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండాలని చెప్పారు మహీంద్రా.

ఈ ఫోటోపై దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా కూడా స్పందించారు. సార్, మీరు మా పొట్ట ఎందుకు కొడుతున్నారు అని సరదాగా కామెంట్ చేశారు. ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని 17 వేల మందికి పైగా లైక్ చేశారు.  అంతేకాదు పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఎవరికైనా తమ ఆదాయం కంటే చమురు ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉపయోగించవచ్చు.. ఇది దేశీయ జుగాడ్ అని అన్నారు. మరొక వినియోగదారు  ‘భారతీయులు ఎల్లప్పుడూ జుగాడ్ ను నమ్ముతారని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు,  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ఏఆర్ రెహ్మాన్ ఇంట పెళ్లి సందడి మామ అయిన మ్యూజిక్ మాస్ట్రో..

Sonu Sood: సంపాదన కంటే సాయం చేయడంలోనే సంతృప్తి.. త్వరలో అనాథల కోసం ఆశ్రమం నిర్మిస్తానన్న కలియుగ కర్ణుడు