AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Spoon: అద్భుతం చేసిన శాస్త్రవేత్తలు.. ఆహారానికి ఉప్పుని, రుచిని ఇచ్చే స్పూన్ సృష్టి.. ధర తెలిస్తే షాక్..

జపాన్‌లో ప్రత్యేకమైన బ్యాటరీతో పని చేసే చెంచా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్పూన్‌ ఆహారాన్ని ఉప్పగా రుచి చేస్తుంది. ప్లాస్టిక్, మెటల్‌తో తయారు చేయబడిన ఈ స్పూన్ ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి కష్టపడుతున్న వారి కోసం తయారు చేయబడింది. ఈ చెంచా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనిని ఇతర పరిశోధకులతో కలిసి మీజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హోమి మియాషితా అభివృద్ధి చేశారు. నివేదిక ప్రకారం ఈ 'ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్' టెక్నిక్ 2023లో Ig నోబెల్ అవార్డును గెలుచుకుంది.

Electric Spoon: అద్భుతం చేసిన శాస్త్రవేత్తలు.. ఆహారానికి ఉప్పుని, రుచిని ఇచ్చే స్పూన్ సృష్టి.. ధర తెలిస్తే షాక్..
Electric Salt SpoonImage Credit source: Reuters
Surya Kala
|

Updated on: Jun 04, 2024 | 8:36 AM

Share

ఆహారానికి రుచిని అందించడానికి ఉప్పుది ప్రముఖ పాత్ర. వాస్తవంగా ఉప్పు లేని ఏ వంటకం అయినా రుచిగా ఉండదు. అయితే ఉప్పుని ఎక్కువ మోతాదులో ఉపయోగించినా మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకనే ఉప్పు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని వైద్యులు ఎల్లప్పుడూ సలహా ఇస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ స్పూన్‌ను రూపొందించారు, ఇది ఆహారాన్ని దానంతటదే ఉప్పగా మార్చుతుంది. ఇది మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్పూన్‌ మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

స్కై న్యూస్ నివేదిక ప్రకారం.. జపాన్‌లో ప్రత్యేకమైన బ్యాటరీతో పని చేసే చెంచా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్పూన్‌ ఆహారాన్ని ఉప్పగా రుచి చేస్తుంది. ప్లాస్టిక్, మెటల్‌తో తయారు చేయబడిన ఈ స్పూన్ ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి కష్టపడుతున్న వారి కోసం తయారు చేయబడింది. ఈ చెంచా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

దీనిని ఇతర పరిశోధకులతో కలిసి మీజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హోమి మియాషితా అభివృద్ధి చేశారు. నివేదిక ప్రకారం ఈ ‘ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్’ టెక్నిక్ 2023లో Ig నోబెల్ అవార్డును గెలుచుకుంది. ఇది ప్రత్యేకమైన పరిశోధనలను గౌరవించే వేదిక.

ఇవి కూడా చదవండి

సోడియం అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, స్ట్రోక్ , ఇతర ఆరోగ్య ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. జపాన్‌లోని పెద్దలు రోజుకు సగటున 10 గ్రాముల ఉప్పును తింటారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మొత్తం కంటే రెండింతలు. దీంతో శాస్త్రవేత్తలు ఉప్పు వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ స్పూన్‌ ను సృష్టించారు.

ఎలక్ట్రిక్ స్పూన్‌ ధర ఎంత? ఎలక్ట్రిక్ స్పూన్‌ ను ఉపయోగించడం వలన తినే ఆహారంలో లవణం ఒకటిన్నర రెట్లు పెరుగుతుందని దీన్ని తయారు చేస్తున్న జపాన్ కంపెనీ కిరిన్ చెబుతోంది. వినియోగదారులు తమకు నచ్చిన ఇంటెన్సిటీని నాలుగు వేర్వేరు స్థాయిల్లో ఎంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. మే 20న మార్కెట్ లో రిలీజైన ఈ ఎలక్ట్రిక్ స్పూన్‌ ధర 19,800 యెన్లు (అంటే భారత కరెన్సీలో రూ. 10,469.79).

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..