భారత్‌లో ఎల్‌అండ్‌టి ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణియన్ ’90 గంటల పని’ చేయండి అని చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగుతోంది. అదే సమయంలో ఏ పని చేయకుండా ఏడాదికి రూ.69 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తికి సంబంధించిన వార్త కూడా అంతే ఆసక్తి కలిగిస్తుంది. ఈ వ్యక్తి జపాన్‌లో ఉన్నాడు. అవును షోజీ మోరిమోటో అనే ఈ జపాన్ కు చెందిన వ్యక్తికి ప్రజలు స్వయంగా డబ్బు ఇస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం..
41 ఏళ్ల షోజీ ఎలాంటి శారీరక శ్రమ లేకుండా లక్షల్లో సంపాదీస్తున్న వ్యక్తిగా జపాన్‌లో ప్రసిద్ధి చెందాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న ఎవరి మదిలో అయిన తలెత్తవచ్చు. నిజానికి షోజీ ప్రత్యేక వ్యక్తిత్వమే అతని ఆదాయ వనరు. అలా ఎలా అని అనుకుంటున్నారా..
జపాన్‌లో ప్రత్యేకమైన అద్దె సేవా పరిశ్రమ ఉంది. అంటే ఎవరికైనా మంచి సహచరులు కావాలనుకుంటే అద్దెకు సహచరులను అందిస్తాది. షోజీ కూడా ఈ సేవ సంస్థలో సభ్యుడు. షోజీ మాట్లాడే విధానం చాలా పవర్‌ఫుల్‌గా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దీంతో అతనితో సమయం గడపడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. 2018లో ఏ పని చేయడం లేదంటూ షోజీని ఉద్యోగం నుంచి తీసేశారు. అప్పుడు అతను ఈ అద్దె సేవా సంస్థలో సభ్యుడిగా మారాడు.
షోజీ మాటల్లో అపరిచితుడు కూడా చాలా త్వరగా అతుక్కుపోయేంత మ్యాజిక్ ఉంటుందని చెబుతున్నారు. ఈ గుణమే అతడిని అద్దె సేవల ప్రపంచంలో విశేష ప్రాచుర్యం తీసుకొచ్చింది. షోజీ ప్రజలను కలవడం లేదా వారితో మాట్లాడడం ద్వారా డబ్బు తీసుకోవడమే కాదు.. ప్రతిరోజూ తన మొబైల్ ద్వారా 1000 మందికి పైగా అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ కూడా అందుకుంటాడు.
షోజీ కేవలం వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఒక సంవత్సరంలో 80,000 డాలర్లు (అంటే సుమారు రూ. 69 లక్షలు) సంపాదించాడు. ఎవరైనా విచారంగా ఉన్నప్పుడు.. వారిని ఓదార్చగల వ్యక్తి అవసరం అని అతను చెబుతాడు. అలా ఓదార్పు అవసరం అనుకున్న వ్యక్తులు షోజీని కలుసుకుని తమ భావాలను పంచుకుంటారు. అప్పుడు షోజీతో మాట్లాడిన తర్వాత మనసు తెలికినట్లు భావిస్తారు. అందుకనే అంతగా అతనికి డిమాండ్ ఉంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..