పుస్తకంలో ఉన్న నిధి కోసం అన్వేషణ.. పార్కుకు వెళ్లి కొండను తవ్వి ఎలుకను పట్టిన ఫ్యామిలీ

|

May 31, 2024 | 10:10 AM

58 ఏళ్ల డేవిడ్ స్టేట్టెన్ ద్వీపంలో ఒక నిధి దాగి ఉందని.. ఆ నిధిని గురించిన సమాచారం ఒక పుస్తకంలో ఉందని నమ్మాడు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఆ నిధిని చేరుకోలేకపోయారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం గత శనివారం ఉదయం 6 గంటలకు, డేవిడ్ అతని భార్య మిచెల్ తన ఇద్దరు కుమారులు టైలర్, ర్యాన్‌లతో కలిసి ఈ ద్వీపంలోని ఒక చిన్న పార్కులో త్రవ్వడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న నిధిని వెలికి తీయడం కోసం మొత్తం ఫ్యామిలీ అంతా భూమిని తవ్వడం ప్రారంభించారు.

పుస్తకంలో ఉన్న నిధి కోసం అన్వేషణ.. పార్కుకు వెళ్లి కొండను తవ్వి ఎలుకను పట్టిన ఫ్యామిలీ
The Secret A Treasure Hunt
Follow us on

సినిమాల్లో కథల్లో రాజుల కాలం నాటి గుప్త నిధుల కోసం చరిత్ర పుస్తకాలు చదివి అందులో ఉన్న నిధిని వెతకడానికి బయలుదేరి, కష్టాలన్నింటినీ అధిగమించి, చివరికి ఆ గుప్త నిధిని కనుగొంటారు. అదే విధంగా వాస్తవానికి పుస్తకాల్లో ఉన్న విధంగా నిధి గురించి చదవడం, నిధిని వెదకం.. తర్వాత ఆ నిధిని ఖచ్చితంగా కనుగొనడం కొంచెం కష్టమే.. అయినప్పటికీ ప్రజలు నిధి జాడ అనగానే ప్రయత్నిస్తూ ఉంటారు. అలా అమెరికాలోని కొలరాడోకు చెందిన ఓ వ్యక్తి కూడా నిధి గురించి అన్వేషణ చేసి ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

ఈ వ్యక్తి పేరు డేవిడ్ హేగర్. 58 ఏళ్ల డేవిడ్ స్టేట్టెన్ ద్వీపంలో ఒక నిధి దాగి ఉందని.. ఆ నిధిని గురించిన సమాచారం ఒక పుస్తకంలో ఉందని నమ్మాడు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఆ నిధిని చేరుకోలేకపోయారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం గత శనివారం ఉదయం 6 గంటలకు, డేవిడ్ అతని భార్య మిచెల్ తన ఇద్దరు కుమారులు టైలర్, ర్యాన్‌లతో కలిసి ఈ ద్వీపంలోని ఒక చిన్న పార్కులో త్రవ్వడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న నిధిని వెలికి తీయడం కోసం మొత్తం ఫ్యామిలీ అంతా భూమిని తవ్వడం ప్రారంభించారు.

ఈ పుస్తకాన్ని చదివిన డేవిడ్ హేగర్

ఇవి కూడా చదవండి

వాస్తవానికి 1982లో బైరాన్ ప్రీస్ రాసిన పుస్తకం ది సీక్రెట్: ఎ ట్రెజర్ హంట్ నుంచి స్టాటెన్ ఐలాండ్‌లో నిక్షిప్తం చేసిన నిధికి సంబంధించిన ఆధారాలను తాను సరిగ్గా అర్థం చేసుకున్నానని డేవిడ్ హేగర్ నమ్మాడు. జియాలజిస్ట్ , సైన్స్ టీచర్ అయిన హేగర్ మాట్లాడుతూ.. ‘పుస్తకంలో ఎవరికీ అర్థం కాని రెండు విషయాలు ఉన్నాయి. ఆ విషయాలపై పూర్తి దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. డేవిడ్ , తన మొత్తం కుటుంబంతో పాటు వారాంతంపు సెలవులో నిధి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిధిని కనుగొనడంలో విఫలమయ్యారు. అయినా వారు తమ పట్టుదల వదల్లేదు. మళ్లీ నిధి కోసం వెతకడం ప్రారంభిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నిధి క్లూ ఇచ్చిన రచయిత

నివేదికల ప్రకారం బైరాన్ ప్రైస్ 1980ల ప్రారంభంలో 12 US నగరాల్లో ప్లెక్సీగ్లాస్ కేసులో క్యాస్క్, కీలను పాతిపెట్టినట్లు నమ్మాడు. పుస్తకంలో అందుకు సంబంధించిన ఆచూకీ గురించి అతను ఆధారాలు ఇచ్చాడు. వీటిలో ఇప్పటి వరకు కనుగొనబడని మూడు నిధులు మాత్రమే ఉన్నాయి. ఈ నిధులు చికాగో, క్లీవ్‌ల్యాండ్, బోస్టన్‌లలో ఎక్కడో ఉన్నాయి. ఐదు బస్తాల్లో ఎక్కడో దోపిడిని ఉంచినట్లు నమ్ముతారు. అయితే ఆ నిధి ఇప్పుడు కూడా కనుక్కోలేకపోయారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..