స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సెల్ఫీలు దిగడం క్రేజ్‌గా మారింది. అందమైన ప్రదేశాలకు వెళ్లి సెల్ఫీలు దిగి విలువైన క్షణాలను, అందమైన క్షణాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికీ కొందరు ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగేందుకు ఎంతటి సాహసాన్ని అయినా చేస్తున్నారు. సెల్ఫీల పిచ్చితో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. కొండ కోనల్లో పిచ్చి సాహసం చేసి తమ విలువైన జీవితాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఉదంతాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా కొందరు ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగి రీళ్లు చేసే సాహసం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఆకాశం తాకుతున్నట్లు ఉన్న ఎత్తైన కొండ అంచున ఓ యువతి సెల్ఫీ దిగేందుకు వెళ్ళింది. అక్కడ 262 అడుగుల లోతైన గుంతలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
చెకోస్లోవేకియాకు చెందిన 23 ఏళ్ల స్టార్ జిమ్నాస్ట్ నటాలీ స్టిచోవా సెల్ఫీ క్రేజ్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. జర్మనీలోని టెగెల్‌బర్గ్‌లోని న్యూష్వాన్‌స్టెయిన్ కాజిల్ సమీపంలో ఆమె సెల్ఫీ తీసుకుంటుండగా జారి 262 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
వైరల్ పోస్ట్ ఇక్కడ చూడండి
Czech gymnast Natalie Stichova, 23, dies after 262ft fall from Tegelberg Mountain in #Bavaria, #Germany
Natalie was taking a selfie near Neuschwanstein Castle when she slipped off edge
Survived initial fall but taken off life support due to brain damage#RIP 🙏 pic.twitter.com/7scHL8m8st
— True Crime Updates (@TrueCrimeUpdat) August 26, 2024
వెంటనే జిమ్నాస్ట్ నటాలీ స్టిచోవాను ఆసుపత్రికి తరలించగా మెదడుకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్నీ తెలియజేస్తూ ట్రూ క్రైమ్ అప్‌డేట్స్ పేరుతో X ఖాతాలో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. ఇక్కడ స్టార్ జిమ్నాస్ట్ నటాలీ స్టిచోవా మరణం గురించి ప్రకటించింది. ఈ విషాద ఘటనపై స్పందిస్తూ నెటిజన్లు జిమ్నాస్ట్ నటాలీ స్టిచోవా మరణానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..