కొంతమందికి గోర్లు పెంచుకోవడం అంటే మహా సరదా.. ముఖ్యంగా ఆడవారు తమ గోళ్లను పొడుగ్గా పెంచుకొని వాటిని అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. రకరకాల రంగులు వేస్తూ వాటిని అందంగా చేస్తూ ఉంటారు. ఈ మధ్య మగవారు కూడా గోర్లు పెంచుకుంటున్నారు. గోర్లు అనేవి జన్యువులకు సంబంధించి పెరుగుతాయి . అలాగే ఒక ఆకృతిని కలిగి ఉంటాయి. అసలు వేళ్ళకు గోర్లు లేకుంటే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా..? గోర్లు లేకుండా మన చేతివేళను ఊహిచుకోలేం కూడా.. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కనిపిస్తోన్న వ్యక్తి చేతికి గోళ్లు లేవు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అయితే ఇది గ్రాఫిక్స్ కాదు నిజమే.. ఈ ఫొటోలో కనిపిస్తోంది నిజమే ఆ వ్యక్తికి నిజంగానే గోర్లు లేవు. అయితే ఒక వ్యాధి కారణంగా ఇలా గోర్లు పెరగవట. అమ్మోనియా అనే ఆరోగ్య సమస్య వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందట. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తికి పుట్టినప్పటి నుండి గోళ్లు లేవు. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. రోజువారీ పనులు ఎలా నిర్వహిస్తున్నారని ఒకరు అడిగారు. మీరు డబ్బాలు ఎలా తెరుస్తారు అని ఒకరు అడిగారు. నారింజ పండ్లను తీయడం పెద్ద కష్టమని మరో వ్యక్తి కామెంట్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్‌కి 27 వేలకు పైగా లైకులు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ గోరు సమస్యలపై వేలాది మంది కామెట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..