Viral News: ఉద్యోగం చేసి తమ ఫుడ్ ని తామే సంపాదించుకుంటున్న కుక్కలు, పిల్లులు.. ఎక్కడంటే..

|

Oct 20, 2024 | 6:31 PM

కుక్కలతో పాటు పిల్లలు కూడా మనుషుల జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే కుక్కలను, పిల్లుల్ని కేరింగ్ గా చూడడం.. వాటిని పోషించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వీటి సంరక్షణ కోసం చాలా ఖర్చవుతుంది. అయితే మరేం పర్వాలేదు.. మాకు అయ్యే ఖర్చును మేమే సంపాదించుకుంటాం అంటున్నాయి మన పొరుగు దేశం అయిన చైనాలోని పెట్స్‌. వీటికి జాబ్స్‌ ఇస్తున్నాయి అక్కడ కొన్ని కేఫ్‌లు.

Viral News: ఉద్యోగం చేసి తమ ఫుడ్ ని తామే సంపాదించుకుంటున్న కుక్కలు, పిల్లులు.. ఎక్కడంటే..
Pets In China Are Working
Image Credit source: social media
Follow us on

మనిషికి జంతువులకు పూర్వకాలం నుంచి అవినాభావ సంబంధం ఉంది. పాల కోసం ఆవులు, గేదెలు వంటి వాటిని పెంచితే.. రవాణా కోసం గుర్రాలు, గాడిదలు వంటి వాటిని పెంచేవారు. ఇక ఇంటికి కావాలా కోసం కుక్కలను పెంచేవారు. విశ్వాసానికి పెట్టింది పేరు శునకం.. అయితే కాలక్రమంలో కుక్కలు కుటుంబంలో ఒక సభ్యులుగా మారాయి. చాలా మంది చైనీయులు రెస్టారెంట్‌లకు, కేఫ్‌లకు వెళ్తుంటారు. అక్కడ పెట్స్‌తో ఎంజాయ్ చేసేందుకు వినోదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇందుకోసం పెంపుడు కుక్కలను, పెంపుడు పిల్లుల్ని నియమించుకుంటున్నాయి ఈ కేఫ్‌లు. దీనికోసమే డ్రాగన్ కంట్రీలో స్పెషల్ పెట్‌ కేఫ్‌లు ఉన్నాయి.

తమ పెంపుడు కుక్కలు, పిల్లులను ఈ కేఫ్‌లలో పని చేయడానికి పంపుతున్నారు వాటి యజమానులు. ఇలా ఉద్యోగం చేసుకుని పెంపుడు జంతువులు తమ కోసం తామే సంపాదించుకుంటున్నాయి. కెఫేలలో పని చేస్తూ అవి తోటి జంతువులతో హ్యపీగా గడుపుతున్నాయి. అంతేకాదు తమ ఆహారం కోసం తామే సంపాదించుకుంటున్నాయి. Zhengmaotiaoqian లేదా earn snack money అని పిలుస్తున్న ఈ ట్రెండ్ చైనాలోని పెంపుడు జంతువులను ప్రేమించే కమ్యూనిటీలో విజయవంతమైంది.

ఉద్యోగం కోసం పెంపుడు కుక్కలు, పిల్లులు కావాలి అంటూ.. పెంపుడు జంతువుల ఉద్యోగుల” కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటనలు, సీవీలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో భారీగా కనిపిస్తున్నాయి. జేన్ జుయే అనే ఆమె తన రెండేళ్ల పెంపుడు కుక్కను ఫుజౌలోని డాగ్‌ కేఫ్‌కి పంపుతోంది. చిన్న పిల్లల్ని డే కేర్‌కి పంపే విధానంలాగా ఉందని దీని వల్ల తనకు ఏసీ ఖర్చు ఆదా అవుతోందని జేన్‌ చెప్పింది. అయితే అన్ని పెట్స్‌కూ జాబ్స్‌ దొరకడం కష్టం. జిన్‌ జిన్‌ అనే వ్యక్తి తన రెండేళ్ల పిల్లికి జాబ్‌ కోసం వెతుకుతున్నాడు. జియావోహోంగ్‌షూ వెబ్‌సైట్‌లో సీవీ పోస్ట్‌ చేసినా రెస్పాన్స్‌ రాకపోయేసరికి తనే స్వయంగా సీవీ పట్టుకెళ్లి ప్రయత్నించాలని అనుకుంటున్నాడట.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..