Viral Video: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఛాలెంజ్‌ని పూర్తి చేసిన యువకుడు..నిర్జన నగరంలో 7 రోజులు

|

Mar 05, 2024 | 1:52 PM

1990లలో క్రొయేషియన్ స్వాతంత్ర్య యుద్ధంలో నగరం భారీగా బాంబు దాడికి గురైంది. దీని కారణంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ నగరాన్ని ఖాళీ చేసి పారిపోయారు, వారు మళ్లీ ఇక్కడికి తిరిగి రాలేదు. రీసెంట్ గా సోషల్ మీడియాలో మిస్టర్ బీస్ట్ గా పిలుచుకునే జిమ్మీ డొనాల్డ్ సన్ అతని స్నేహితులు కొందరు ఏడు రోజులుగా ఈ నగరంలోనే గడిపేందుకు ప్రయత్నించారు.

Viral Video: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఛాలెంజ్‌ని పూర్తి చేసిన యువకుడు..నిర్జన నగరంలో 7 రోజులు
An Abandoned City
Follow us on

ప్రపంచంలో అనేక వింత ప్రదేశాలు ఉన్నాయి. అవి ఇంతకు ముందు నివాసయోగ్యలు.. అంటే ఇంతకు ముందు మానవులు నివసించేవారు. అయితే తరువాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రదేశాలు పూర్తిగా నిర్జనమైపోయాయి. ఇప్పుడు అక్కడ మనిషిగానీ, జంతువుగానీ కనిపించడం లేదు. ‘కుపారి’గా పిలవబడే క్రొయేషియాలో ఇలాంటి ప్రదేశం ఉంది. ఇది పూర్తిగా ఎడారిగా ఉన్న చిన్న పట్టణం. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, హోటళ్లు ఉన్నా ఇక్కడ ఎవరూ నివసించకపోవడంతో అవి క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సవాళ్లలో ఒకటిగా అభివర్ణించబడిన ఈ నిర్జన నగరంలో ఏడు రోజులు గడిపే సవాలును ఓ యువకుడు పూర్తి చేశాడు.

వాస్తవానికి 1990లలో క్రొయేషియన్ స్వాతంత్ర్య యుద్ధంలో నగరం భారీగా బాంబు దాడికి గురైంది. దీని కారణంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ నగరాన్ని ఖాళీ చేసి పారిపోయారు, వారు మళ్లీ ఇక్కడికి తిరిగి రాలేదు. రీసెంట్ గా సోషల్ మీడియాలో మిస్టర్ బీస్ట్ గా పిలుచుకునే జిమ్మీ డొనాల్డ్ సన్ అతని స్నేహితులు కొందరు ఏడు రోజులుగా ఈ నగరంలోనే గడిపేందుకు ప్రయత్నించారు. నగరంలోని ఓ బిల్డింగ్ పైన వీరిని వదిలేశారు. అయితే వారికి ఆహార పదార్థాలు విరివిగా ఇవ్వడంతో పాటు.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్లీపింగ్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు.

ఛాలెంజ్‌ను మధ్యలోనే వదిలేశిన ఇద్దరు వ్యక్తులు

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం ఛాలెంజ్ మొదటి రోజు జిమ్మీ, అతని స్నేహితులు తెరిచి ఉన్న భవనం పైన తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాత్రివేళల్లో చలిని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాత్రి అద్దాలు పగులుతున్న శబ్దం కూడా విని భయపడ్డారు. అయితే, ఆ తర్వాత టీమ్‌లోని ఇద్దరు సభ్యులు నీటి సరఫరాలో ఇబ్బంది ఏర్పడ్డాయని చెప్పడంతో ఛాలెంజ్‌ను మధ్యలోనే వదిలేశారు. అటువంటి పరిస్థితిలో సవాలును పూర్తి చేయడానికి జిమ్మీ , మార్క్ అనే ఇద్దరు వ్యక్తులు మాత్రమే మిగిలారు.

మిలియన్ల సార్లు వీక్షించబడిన వీడియో

ఈ ప్రత్యేకమైన ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో కూడా షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 6 కోట్ల 90 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. వీడియోను చూస్తూ, ‘ఇది నిజంగా చాలా కష్టమైన ఛాలెంజ్’ అని ఒకరు చెబుతుండగా, ‘MrBeast ఈ నిర్జన నగరాన్ని పునరుద్ధరించాలి, తద్వారా ప్రజలు మళ్లీ ఇక్కడ నివసించవచ్చు’ అని ఒకరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..