Viral News: సొంత ఇల్లు మీ కలా.. స్వర్గంలా అందమైన ప్రదేశంలో రూ. 90కే ఇల్లు.. ప్రభుత్వం రూ. 27 లక్షల బహుమతి.. ఎందుకంటే

|

Jul 12, 2024 | 9:09 AM

ఎందుకంటే ఒక ప్రాంతంలో మంచి వసతి.. నివసించడానికి తగినన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ నివసిస్తే తిరిగి డబ్బులు కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి మంచి ఆఫర్ ఇటలీ లో ఉంది. ఇక్కడ అందమైన బీచ్‌లతో కనువిందు  చేసే స్వర్గంలాంటి ఇంటిలో నివసించడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అంతే కాదు స్వర్గం లాంటి చోట బతకడానికి ఇక్కడి ప్రభుత్వం రూ.27 లక్షలు కూడా ఇస్తోంది.

Viral News: సొంత ఇల్లు మీ కలా.. స్వర్గంలా అందమైన ప్రదేశంలో రూ. 90కే ఇల్లు.. ప్రభుత్వం రూ. 27 లక్షల బహుమతి..  ఎందుకంటే
Tuscany Village
Image Credit source: Social Media
Follow us on

ప్రతి వ్యక్తి తన కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. అందుకు అద్భుతమైన ఇల్లు ఉండాలని కలలు కంటాడు. అయితే సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు అక్కడ అందం.. ఆ ప్రదేశం నచ్చితే చేతిలో డబ్బుంటే అక్కడే ఒక ఇల్లు కొనుగోలు చేసి అక్కడే సెటిల్ అయిపోదామన్న ఆలోచన  చాలా మందికి వస్తుంది. అయితే డబ్బులున్నా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఉద్యోగస్తులకు సాధ్యం కాదు. అయితే ఎవరైనా సరే ఇక్కడ ఉండమని ఎవరైనా మీకు డబ్బు ఇస్తే? అటువంటి అవకాశాన్ని వదిలివేస్తారా?

ఇదంతా కల అని ఎవరైనా అనుకుంటే అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఒక ప్రాంతంలో మంచి వసతి.. నివసించడానికి తగినన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ నివసిస్తే తిరిగి డబ్బులు కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి మంచి ఆఫర్ ఇటలీ లో ఉంది. ఇక్కడ అందమైన బీచ్‌లతో కనువిందు  చేసే స్వర్గంలాంటి ఇంటిలో నివసించడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అంతే కాదు స్వర్గం లాంటి చోట బతకడానికి ఇక్కడి ప్రభుత్వం రూ.27 లక్షలు కూడా ఇస్తోంది.

ప్రభుత్వం రూ.27 లక్షలు ఎందుకు ఇస్తోందంటే?

యూరోన్యూస్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఇటలీలోని టుస్కానీ ప్రావిన్స్‌లో  ఓ వైపు వలసలు, మరోవైపు  తగ్గుతున్న జనాభా సమస్యతో ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతోంది. ఇక్కడ కేవలం 119 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇక్కడికి వచ్చి నివసించాలనుకుని ఇల్లు కొంటే €10,000 నుంచి €30,000 అంటే మన దేశ కరెన్సీలో  రూ.9 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. టస్కాన్ పర్వతాలు ఇటలీలోని అత్యంత అందమైన ప్రదేశంలో ఒకటి. ఇక్కడ సహజ సౌందర్యం ఎవరినైనా ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ప్రాంతంలోకి వెళ్ళడానికి.. ఎవరైనా బయటి వ్యక్తి ఈ సౌకర్యాలన్నింటినీ పొందాలనుకుంటే..  అతను 10 సంవత్సరాల పాటు ఇక్కడే ఉండాలి. ఈ మేరకు ప్రభుత్వ అనుమతిని తీసుకోవాలి. ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంటిని రిపేర్ చేయించుకోవాలనుకున్నా కూడా ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. అప్పుడు ప్రభుత్వం 50 శాతం డబ్బు ఇస్తుంది. ఇంటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చులో 50 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి అందుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశ్యం స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడమే..! ఎందుకంటే ప్రజలు ఇక్కడ స్థిరపడినప్పుడు ఉపాధి కూడా పెరుగుతుందని ప్రభుత్వం నమ్మకం.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..