
ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం నిజంగా చాలా విచిత్రమైనది. అనేక రకాల వింత జీవులు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. కొన్ని రకాల వింతలు, విశేషాల గురించి తెలిసి జనం ఉలిక్కిపడుతూ ఉంటారు కూడా.. ఇలాంటి వింత జీవులు భూమిపైనే కాకుండా సముద్రం లోపల కూడా కనిపిస్తాయి. అందుకే వీటి గురించి తెలిసినప్పుడల్లా ఆశ్చర్యపోతూ ఉంటారు. అటువంటి జీవిలో సంబంధించిన చిత్రం ప్రస్తుతం ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ఇది సముద్రం లోతుల్లో ఉండే జీవి స్ట్రాబెర్రీ స్క్విడ్. దీని శరీరంపై మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది. ఎలా అంటే.. శరీరం పై వజ్రాలు, రత్నాలు పొడిగినట్లు కనిపిస్తుంది. ఎరుపు, నీలం, బంగారు పసుపు, వెండి రంగులతో మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది. అంతేకాదు ఈ జీవి శరీర ఆకృతి సరిగ్గా స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది. దాని వల్ల దీని పేరు స్ట్రాబెర్రీ స్క్విడ్ అని పెట్టి ఉంటారు. దీనిని సడెన్ గా ఎవరైనా చూస్తే.. ఖచ్చితంగా మెరిసే వజ్రం అంటూ భ్రమపడతారు. ఇది అందంగా కనిపిస్తుంది కదా అని దీని దగ్గరకు వెళ్లే తప్పు చేయవద్దు ఎందుకంటే ఇది ప్రమాదకరమైన జీవి. దీనిని 1913లో బెర్రీ కనుగొన్నాడు
శాస్త్రవేత్తలు ఈ జీవికి కాక్-ఐడ్ స్క్విడ్అని పేరు పెట్టారు. ఈ స్క్విడ్ ఎడమ కన్ను దీని కుడి కన్ను కంటే రెండింతలు పెద్దదిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ స్క్విడ్ సముద్రపు అడుగుభాగంలో ఉపరితలం నుండి 1,000 మీటర్ల (3,300 అడుగులు) లోతు వరకు ఉంటుంది.
ఈ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో @venueearth అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది. 75 వేల మందికి పైగా లైక్ చేశారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ రామ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన జీవి అని ఒకరు .. సహజ సౌందర్యం అని మరొకరు.. చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..