Anchor Anasuya: అనసూయ ‘ఆంటీ’ అనే పదం వెనుక ఇంత కథ ఉందా..? ఎమోషనల్ వీడియో వైరల్
అనసూయ ఈమె బుల్లితెరపై యాంకర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. ఇప్పుడు వెండితెరపై అద్భుతమైన పాత్రలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు పొందారు. సమయం దొరికినప్పుడల్లా తన భావాలను, ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. దీనికి సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకుంటారు. తాను ఎక్కడైనా వెకేషన్‌కి వెళితే అక్కడి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. దీనిపై రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. నెటిజన్లు. ఇందులో ఆంటీ అనే

అనసూయ ఈమె బుల్లితెరపై యాంకర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. ఇప్పుడు వెండితెరపై అద్భుతమైన పాత్రలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు పొందారు. సమయం దొరికినప్పుడల్లా తన భావాలను, ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. దీనికి సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకుంటారు. తాను ఎక్కడైనా వెకేషన్‌కి వెళితే అక్కడి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. దీనిపై రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు నెటిజన్లు. ఇందులో ఆంటీ అనే పదం వింటే అనసూయకు చిర్రెత్తిపోతుంది. కావాలనే కొందరు ఇలా కామెంట్ పెడుతూ ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయితే ఆంటీ అనే పదంపై తనకు ఎందుకు కోపం వస్తుందో ఇటీవల జరిగిన ఒక ఇంటర్వూలో తన భావాలను పంచుకున్నారు. ఇంతకూ ఆమె ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
యాంకర్ అనసూయ మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏదైనా ఒకదానిపై స్పందిస్తే దానికి నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవచ్చు కదా ఆంటీ అని కించపరుస్తూ మాట్లాడుతారు. ఇది తనకు నచ్చదని చెప్పారు. ఆంటీ అనే పదం తప్పు కాదు.. అయితే దాన్ని ఉపయోగించే విధానంలో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఈ పదాన్ని అధికశాతం మంది వల్గర్ గా వాడతారన్నారు. చిన్న పిల్లలు, తెలిసిన వాళ్ళు వచ్చి ఆంటీ అని ముద్దుగా పిలుస్తారు. అలా వాళ్లు ఆంటీ అని పిలిస్తే నాకు ఇష్టమే అన్నారు. కానీ తన వయసుతో సమానమైనే వాళ్లు ఆంటీ అని మరో అర్థం వచ్చేలా పిలుస్తారు అందుకే నాకు నచ్చదు. సాధారణంగా ఆంటీ అంటే ఇంగ్లీష్ లో పిన్ని అని అర్థం. అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి ఈ పదాన్ని వాడతారు. ఈ సందర్భంగా తన బాల్యాన్ని గురించి ప్రస్తావించారు.
నేను చిన్నప్పుడు చాలా మందిని ఆంటీ అనే పిలిచాను. అలా పిలవడం వాళ్లకు నచ్చకపోయి ఉంటే నేను పిలవడం మానేస్తా. ఎందుకంటే.. నేను అలా పిలిస్తే వాళ్ళు హర్ట్ అవుతున్నారని నేను అర్ధం చేసుకోగలను అని చెప్పారు. ఇక తన విషయంలో కూడా ఇలా పిలిచిన వారిని హెచ్చరించించినట్లు తెలిపారు. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు అనాలి. అవతలి వాళ్ళని ఎందుకు హార్ట్ చేయాలి అనే దాని గురించి వివరణ ఇచ్చారు. వద్దన్న పని చేస్తూ పైశాచిక ఆనందం పొందడం ఎందుకు. నా మీద కామెంట్స్ చేసిన వాళ్లను ఈ జన్మలో ఎప్పుడో ఒక్కసారైనా ఎదురెదురుగా చూసే అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు. పైగా నేను ఎలా ఉంటానో అతనికి తెలియదు. ఇలా ఫేస్ టు ఫేస్ పరిచయం లేని వ్యక్తిపైనే ఇంత అ ఇష్టానికి పూనుకుంటే.. చుట్టుపక్కల ఉన్న మహిళలను ఇంకెలా చూస్తాడో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లు భవిష్యత్తులో రేపిస్ట్‌లుగా మారుతారని సంచల వ్యాఖ్యలు చేశారు. ఆంటీ అనే అంశంపై స్పందిస్తూనే.. కొంత భావోద్వేగానికి గురయ్యారు అనసూయ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగా మారింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.