Viral News: ప్రొఫసర్ జారీ చేసిన ఇంగ్లిష్ సర్క్యులర్ తప్పుల తడక.. ఇక నెటిజనం ఊరుకుంటారా..

దేశంలోని అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాలలో బీహార్ విద్యార్థులు అగ్రస్థానంలో పనిచేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో విద్య వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. బీహార్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియాలో ఓ ట్విట్ చేశారు.

Viral News: ప్రొఫసర్ జారీ చేసిన ఇంగ్లిష్ సర్క్యులర్ తప్పుల తడక.. ఇక నెటిజనం ఊరుకుంటారా..
Viral News

Updated on: Jun 14, 2022 | 1:49 PM

Viral News: భారతదేశంలోని అత్యంత వెనుకబడిన రాష్ట్రాల గురించి మాట్లాడితే.. అందులో బీహార్ పేరు ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుంది. ఇక ఆ రాష్ట్రంలో విద్యావ్యవస్థ  స్థాయి గురించి ఎప్పుడూ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.  IIT నుండి UPSC వంటి కష్టతరమైన పరీక్షలలో ప్రతి సంవత్సరం వందలాది మంది బీహారీ విద్యార్థులు విజయం సాధిస్తున్నారు. అంతేకాదు దేశంలోని అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాలలో బీహార్ విద్యార్థులు అగ్రస్థానంలో పనిచేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో విద్య వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. బీహార్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియాలో ఓ ట్విట్ చేశారు. పాట్నా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సర్క్యులర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. అందులో ఐఏఎస్ ఆఫీసర్ ఇంగ్లీష్ తప్పుల గురించి ప్రస్తావిస్తూ.. చేసిన పోస్ట్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

పాట్నా విశ్వవిద్యాలయం జారీ చేసిన సర్క్యులర్ ఇంగ్లిష్ లో ఉంది. అయితే అందులో చాలా వ్యాకరణ, వ్యాఖ్య నిర్మాణల్లో తప్పులున్నాయి. ఒక యూనివర్సిటీలో సర్కులర్ ఇంత దారుణంగా ఉంటె.. సామాన్య స్టూడెంట్స్ సంగతి ఏమిటి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.  బీహార్ విద్యావిధానం ఏంటని, ఇంగ్లీషులో సర్క్యులర్ కూడా సరిగా రాయలేని వారు.. కాలేజీల్లో ప్రొఫెసర్లగా ఎలా ఉన్నారని యూనివర్శిటీనీ ప్రశ్నించడం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

తప్పులతో ఉన్న ఈ సర్క్యులర్‌ను జూన్ 10న HOD డా. బీనా రాణి జారీ చేశారు. పాట్నా విశ్వవిద్యాలయంలోని పీ హెచ్ డే చేసే స్టూడెంట్స్ ప్రతిరోజూ హాజరు రిజిస్టర్‌లో తమ హాజరును నమోదు చేయాలని ఆదేశించారు. నమోదు చేసుకోకుంటే ఆ రోజు గైర్హాజరైనట్లు పరిగణిస్తామని పేర్కొన్నారు.

ఈ తప్పులతో ఉన్న సర్క్యులర్‌ను ఐఎఎస్ అధికారి సంజయ్ కుమార్  సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఇది పాట్నా విశ్వవిద్యాలయం హెచ్ ఓ డీ జారీ చేసిన నోటీసు.  నిర్లక్ష్యమో, అసమర్ధతనో మన ఉన్నత విద్య స్థితిగతులను ఈ నోటీసు  తెలియజేస్తుంది. ఈ ట్వీట్‌ ని బీహార్ విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరితో పాటు విద్యా శాఖ, అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్‌ కు కూడా ట్యాగ్ చేశారు.

అయితే ఆ ట్వీట్ వైరల్ కావడంతో యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం పాత నోటీసును తొలగించి.. పాత నోటీసులో అక్షర దోషం, క్లరికల్ తప్పులు ఉన్నాయని పేర్కొంటూ కొత్త నోటీసును జారీ చేసింది.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..