రానున్న రోజుల్లో మనిషి చుక్క నీటికోసం అల్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని.. కోట్లాది మంది ప్రజలు తాగడానికి గుక్కెడు నీరు దొరకక నానా ఇబ్బందులు పడే ప్రమాదం కనిపిస్తోందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మనిషి చుక్క నీటి కోసం ప్రజలు తహతహలాడాల్సి వస్తుందని శాస్త్రవేత్త తెలిపారు. ఇంతగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా.. మనిషి వాటిని పెడ చెవిన పెడుతున్నాడు. విచక్షణా రహితంగా నీటి దుర్వినియోగం చేస్తూనే ఉన్నాడు. నీటి విలువ ప్రజలకు ఎప్పుడు అర్థమౌతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి విషయంలో రానున్న కాలం చాలా ఆందోళనకరమే. భూగర్భ జలాలు అడుగంటిపోవడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది . అటువంటి పరిస్థితిలో, మనం రోజూ చాలా నీటిని ఆదా చేయగలమని ఒక వ్యక్తి చాలా చక్కని ఆలోచనతో చెప్పాడు.
దాహం వేసినప్పుడల్లా గ్లాసు నింపుకుని నీళ్ళను తాగుతాం.. అయితే మన పని అర గ్లాసులో అయినా అయిపోతుందని.. మిగిలిన సగం గ్లాసు నీరు వృధా అయిపోతుందని మనకు తెలుసు. అయితే ఆ అర గ్లాసు నీళ్ల గురించి ఆలోచించే సమయం ఎవరికి ఉంటుంది. . అటువంటి పరిస్థితిలో.. ఒక యువకుడు నీటి వృధా చేస్తున్న విధానాన్ని సున్నితంగా తెలియజేశాడు. కొంత దృష్టి పెడితే.. నీరు కూడా వృధా చేయమని చెప్పాడు!.
వైరల్ అవుతున్న ఫోటోలో.. ఒక వ్యక్తి చేతిలో ప్లకార్డుతో నిలబడి ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఇందులో ‘నీరు పూర్తి అవసరం లేనప్పుడు.. ఆ నీటిని అడగండి ఎంత వినియోగించాలి’ అని రాసి ఉంది. ఈ పోస్ట్ చాలా అర్ధవంతంగా నీటి ప్రాముఖ్యత.. నీటిని ఆదా చేయడం గురించి తెలియజేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్టుని ప్రజలు ఇష్టపడుతున్నారు.. అంతేకాదు ఈ పోస్టుని నీటిని ఎక్కువగా వృధా చేసే వారికి షేర్ చేస్తున్నారు. యువకుడు ఒక ఫొటోతో ఇస్తున్న ఈ సందేశం చాలా బాగుంది ఎందుకంటే నిజానికి భూమిపై ఉన్న వనరులలో నీరు కూడా ముఖ్యమైన వనరు. ఒక అంచనా ప్రకారం.. భూమి 70 శాతానికి పైగా నీటితో నిండిపోయి ఉంది. అయితే ఇందులో కేవలం 3 శాతం నీరు మాత్రమే తాగడానికి ఉపయోగపడుతుంది.
होटल-रेस्टोरेंट में आधा ग्लास पानी लें. ज़रूरत पड़ने पर ही और माँगे. pic.twitter.com/TEjkqSDUuh
— Awanish Sharan (@AwanishSharan) December 2, 2022
ఈ చిత్రాన్ని ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘హోటల్ లేదా రెస్టారెంట్‌లో సగం గ్లాసు నీరు తీసుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే ఎక్కువ అడగండనే క్యాప్షన్ ఇచ్చారు ఈ కలెక్టర్. వేల సంఖ్యలో లైకులు, వందల కొద్దీ రీ ట్వీట్లుతో నెట్టింట్లో ఈ ఫోటో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..