Viral News: అక్కడ హౌస్ కీపర్‌కి కోట్లలో జీతాలు.. అయినా పని మనుషులు దొరకరు.. కారణం ఏమంటే?

|

May 31, 2024 | 8:46 AM

హౌస్‌కీపర్ అంటే ఇంటిపని చేసేవారికి కూడా ఉద్యోగస్తుల కంటే జీవితం ఎక్కువగా ఉంటె ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అది కూడా హౌస్ కీపింగ్ పనికి కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటుంటే.. వినడానికే షాక్ ఇస్తున్నది కదా ఈ న్యూస్.. అవును ప్రస్తుతం అలాంటి రెండు ప్రదేశాలు వార్తల్లో ఉన్నాయి. ఇక్కడ గృహనిర్వాహకులకు కూడా కోట్లలో జీతాలు లభిస్తున్నాయి.

Viral News: అక్కడ హౌస్ కీపర్‌కి కోట్లలో జీతాలు.. అయినా పని మనుషులు దొరకరు.. కారణం ఏమంటే?
Housekeepers
Follow us on

లక్షలు, కోట్ల జీతంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ఉద్యోగం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మార్కెట్‌లో అలాంటి ఉద్యోగాలు దొరుకుతాయన్నది నిజమే.. కానీ అందరూ వాటిని పొందలేరు. సాధారణంగా ఏదో ఒక పనిలో నిష్ణాతులైన వారు, మంచి కాలేజీల్లో చదివి ఏళ్ల తరబడి అనుభవం ఉన్నవారు మాత్రమే కోట్లలో జీతాలు పొందుతారని ఓ నమ్మకం. అయితే హౌస్‌కీపర్ అంటే ఇంటిపని చేసేవారికి కూడా ఉద్యోగస్తుల కంటే జీవితం ఎక్కువగా ఉంటె ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అది కూడా హౌస్ కీపింగ్ పనికి కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటుంటే.. వినడానికే షాక్ ఇస్తున్నది కదా ఈ న్యూస్.. అవును ప్రస్తుతం అలాంటి రెండు ప్రదేశాలు వార్తల్లో ఉన్నాయి. ఇక్కడ గృహనిర్వాహకులకు కూడా కోట్లలో జీతాలు లభిస్తున్నాయి.

ఈ ప్రదేశాలు వెస్ట్ పామ్ బీచ్, బోకా రాటన్. ఈ రెండు ప్రదేశాలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నాయి. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ఈ రెండు ప్రదేశాలలో చాలా ధనవంతులు నివసిస్తున్నారు. ఈ సంపన్నులు తమ ఇళ్లలో హౌస్ కీపింగ్ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు సంవత్సరానికి 1.5 లక్షల డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 1 కోటి 25 లక్షల వరకు జీతాన్ని చెల్లిస్తున్నారు. అంతే కాదు ఆ ఉద్యోగి ఓవర్ టైం పనిచేస్తే, దానికి కూడా అదనపు జీతం ఇస్తారు. దీంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కూడా అందుతాయి.. ఈ సౌకర్యాలలో ఆరోగ్య బీమా కూడా ఉంటుంది. అయితే ఇంత జీతం చేల్లిస్తున్నా, ఇన్ని సౌకర్యాలు అందిస్తున్నా ఇక్కడ నివసించే ధనవంతులకు ఇంట్లో పని చేసే వారు దొరకడం లేదు.

ఇంటి పనులు చేసుకునే వారికి గిరాకీ..

ఇవి కూడా చదవండి

సిబ్బంది ఏజెన్సీల ప్రకారం హౌస్‌కీపర్‌ల డిమాండ్ ఇక్కడ బాగా పెరిగింది. 2020 సంవత్సరంలో హౌస్‌కీపర్‌ల జీతం గంటకు సుమారు $25 ఉండగా.. ఇప్పుడు అది $45 నుంచి $50కి పెరిగింది. పామ్ బీచ్, మియామి, న్యూయార్క్ వెలుపల సేవలందిస్తున్న వెల్లింగ్‌టన్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు ఏప్రిల్ బెరూబ్ మాట్లాడుతూ హౌస్‌కీపర్‌లను నియమించాలనే డిమాండ్ గత 30 ఏళ్లలో నేను చూడని డిమాండ్‌లా ఉందని అన్నారు. ముఖ్యంగా పామ్ బీచ్, మయామిలో హౌస్‌కీపర్‌ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది.

ఇక్కడ లక్షాధికారులు మాత్రమే నివాసం

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం పామ్ బీచ్ ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల్లో ఒకటి. అక్కడ నివసించే ప్రతి వ్యక్తి కోట్ల, బిలియన్ల విలువైన నగరాల్లో ఒకటి. ఇక్కడ ఇళ్ల సగటు ధర రూ.12 కోట్లకు పైగానే ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఇక్కడే రిసార్ట్ ఉంది. అంతేకాదు చాలా మంది ప్రసిద్ధ వ్యక్తులు ఇక్కడ నివసిస్తున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..