పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఏ స్థాయిలో ఆందోళన చెందుతారనేదానికి తాజా ఉదాహరణగా నిలిచింది మలేషియాలో జరిగిన సంఘటన. ఓ తండ్రి తన కొడుకు కోసం ఎంతో ఆశతో బైక్ కొనిచ్చాడు.. అయితే ఆ తర్వాత తానే స్వయంగా ఆ బైక్ ని నడి రోడ్డుమీద పార్క్ చేసి నిప్పంటించాడు. అంతే కాదు ఈ వ్యవహారాన్ని మొత్తం వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. అయితే ఒక తండ్రి అంత కర్కశంగా మారడానికి కారణం ఏమి ఉంటుందో ఆలోచించరా..!
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందజేయాలని కోరుకుంటారు. అయితే కొంత మంది తమ పిల్లల కోసం సౌకర్యాల కల్పనకు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. తమ శక్తికి మించి మరీ పిల్లల కోరికలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. అయితే పిల్లల కోసం ఇంత కష్టపడి పని చేసే తల్లిదండ్రులు తమకు ఇష్టం లేకపోయినా కొన్ని కఠిన చర్యలు తీసుకోవావాల్సి వస్తుంది. తాజాగా మలేషియాలోని కౌలాలంపూర్ లో చోటు చేసుకున్న ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
స్థానిక మీడియా సంస్థ ‘సిన్ చ్యూ డైలీ’ ప్రకారం షా ఆలం అనే వ్యక్తి తన కొడుకు కోసం ఒక బైక్ కొనుగోలు చేసాడు. ఈ బైక్ మీద షా తనయుడు హాయిగా పాఠశాలకు వెళ్లాడు. అయితే కాలక్రమంలో షా కొడుకు ఆ బైక్‌ను దుర్వినియోగం చేయడం ప్రారంభించాడు. దీంతో షా కొడుక్కి ప్రమాదం జరిగే అవకాశాలు పెరగడం ప్రారంభించింది. దీంతో తన కొడుకు కూడా ఊహించని లేని విధంగా షా ఆలం అడుగు వేశాడు. తాను కొన్న బైక్ కి స్వయంగా నిప్పు పెట్టి బూడిద చేశాడు. సోషల్ మీడియా వినియోగదారులు షా ఆలం కఠినమైన తీరుపై అనేక రకాల ప్రశ్నలను లేవనెత్తారు.
తన కొడుకు బైక్ ను స్వీడ్ గా నడుపుతున్నాడని… షా ఆలం తన వీడియోలో చెప్పాడు. అంతేకాదు ప్రమాదకరమైన రేసుల్లో పాల్గొనడం ప్రారంభించాడు.. చాలా ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు. దీంతో తన కొడుకు భద్రతపై భయం మొదలైంది అని చెప్పాడు. అంతేకాదు షా ఆలం ఇంకా మాట్లాడుతూ తను మొదట తన కొడుక్కి చాలాసార్లు బైక్ మీద స్పీడ్ గా వెళ్తే జరిగే ప్రమాదాలను వివరించడానికి ప్రయత్నించానని.. అయినా తన కొడుకు వినలేదన్నాడు. ఇలాంటి పరిస్థితిలో తన కొడుకు ప్రమాదం జరిగే లోపు బైక్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు.
ఈ ఘటనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ప్రజలు షా ఆలం చేసిన పనిని విమర్శించారు. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయని చెప్పారు. కోపంతో వేసే అడుగు ఏదైనా సరే సరైనది కాదన్నారు. బైక్‌ను కాల్చే పద్ధతి పిల్లల మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చర్చలు లేదా ఇతర మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటే బాగుండేదని కామెంట్ చేశారు. అదే సమయంలో కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని కొందరు చెబుతున్నారు. అంతేకాదు బైక్ పిల్లల కంటే గొప్పది కాదని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..