Viral News: మొబైల్ ఫోన్ వాడకం తగ్గించేందుకు వింత పోటీ.. 1.2 లక్షలు గెలుచుకున్న యువతి.. ఎక్కడంటే

|

Dec 09, 2024 | 8:37 PM

అందాల సుందరి పోటీలు, తిండి పోటీలు , చివరకు నిద్ర పోటీలు జరుగుతున్న వార్తల గురించి వింటూనే ఉన్నాం. అయితే చైనాలో మాత్రం తాజాగా ఓ విచిత్రమైన పోటీని నిర్వహించారు. ఈ పోటీలో 8 గంటల పాటు ఫోన్ లేకుండా .. కాదు అసలు ఫోన్ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా గడపాలని.. అమ్మబాబోయ్ తినకుండా.. నిద్రపోకుండా అయినా ఉంటాం కానీ సెల్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవదు అని అనుకునే వాళ్ళకు చెక్ పెడుతూ.. ఓ మహిళ ఈ పోటీలో విజేతగా నిలిచి బహుమతిని పట్టేసింది.

Viral News: మొబైల్ ఫోన్ వాడకం తగ్గించేందుకు వింత పోటీ.. 1.2 లక్షలు గెలుచుకున్న యువతి.. ఎక్కడంటే
Mobile Phone Viral News
Follow us on

ఒక చైనీస్ మహిళ 8 గంటల పాటు మొబైల్ ఫోన్ ఉపయోగించనందుకు పోటీలో 10,000 యువాన్ల (మన దేశ కరెన్సీ లో సుమారు రూ. 1.2 లక్షలు) నగదు బహుమతిని గెలుచుకుంది. అయితే, ఛాలెంజ్ కనిపించేంత సులభం కాదు. పాల్గొనేవారు ప్రశాంతంగా ఆనందంగా ఈ ఎనిమిది గంటల సమయాన్ని గడపాల్సి ఉంటుంది. ఈ వింత పోటీ నవంబర్ 29న చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలోని షాపింగ్ మాల్‌లో జరిగింది. ఈ పోటీలో విజేత డాంగ్ అనే సేల్స్ మేనేజర్ విజేతగా నిలిచింది. ఈమె ధరించే దుస్తులను చూసిన నెటిజన్లు “పైజామా సిస్టర్” అనే ముద్దుపేరును పెట్టారు.

జిము న్యూస్ నివేదిక ప్రకారం.. పోటీలో 100కి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే పది మంది మాత్రమే పోటీదారులుగా నిలిచారు. ఈ పోటీదారులు ఎనిమిది గంటల పాటు మంచాలకే పరిమితమయ్యారు. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించడం పై నిషేధం ఉంది.. అంతేకాదు కనీసం మనసులో కూడా వాటిని తలవకోడదు అనే నిబంధన కూడా ఉంది. అందుకనే పోటీదారుల నుంచి పోటీకి ముందే మొబైల్ ఫోన్‌లని నిర్వాహకులు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కాలింగ్ గాడ్జెట్‌లను ఉపయోగించే వీలు కల్పించారు.

అంతేకాదు ఈ పోటీకి కఠినమైన నిబంధనలు కూడా పెట్టారు. అవి ఏమిటంటే.. ఈ 8 గంటలు హ్యాపీగా నిద్రపోవచ్చు అని అనుకోకుండా.. కొన్ని కండిషన్స్ అప్లై చేశారు. పోటీదారులు గాఢ నిద్ర పోవడానికి లేదా ఆందోళన చెండానికి వీలు లేదు. అంతే కాదు వీరు భోజనం, నీరు అన్నీ బెడ్ మీదనే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే టాయిలెట్ కార్యకలాపాల కోసం ఐదు నిమిషాల సమయం ఇచ్చారు. అంటే పోటీలో పాల్గొనేవారి మానసిక ఓర్పుకి పరీక్షాగా ఈ పోటీని నిర్వహించారు. పోటీదారుల మానసిక స్థితిని తెలుసుకునేందుకు పోటీదారుల మణికట్టుకి పట్టీలు కట్టారు. ఇవి 8 గంటల పాటు పోటీదారుల నిద్ర నాణ్యత , ఆందోళనను ట్రాక్ చేశాయి. నివేదిక ప్రకారం చాలా మంది పోటీదారులు నిద్రపోయారు. విశ్రాంతి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

పోటీలో 100 పాయింట్లలో 88.99 స్కోర్ చేసిన డాంగ్ అనే మహిళ విజేతగా నిలిచింది. ఈమె మంచం మీద ఎక్కువసేపు ఉండడమే కాదు.. మానసికంగా ఎటువంటి ఆందోళన ప్రదర్శించలేదు. ఒక్కసారి కూడా సెల్ ఫోన్ కోసం ఆలోచించలేదు. పోటీ సమయంలో గాఢ నిద్రలోకి జారలేదని నిర్వాహకులు చెప్పారు.

విజయం తర్వాత ఇంటర్వ్యూలలో డాంగ్ మాట్లాడుతూ తన ఫోన్‌ని అనవసరంగా ఉపయోగించనని .. పని లేకుండా సెల్ ని స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేయనని చెప్పింది. అంతేకాదు తనకు ఖాళీ సమయం దొరికితే తన పిల్లలకు ట్యూషన్ ని చెబుతానని పేర్కొన్నది. ఆ విధమైన ఆమె జీవనశైలి ఈ పోటీలో గెలవడానికి సహాయపడింది. గాడ్జెట్‌లపై తక్కువ సమయాన్ని వెచ్చించేలా పౌరులను ప్రోత్సహించే లక్ష్యంతో చైనాలో విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ఈ పోటీని నిర్వహించారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..