AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వృధ్యాప్యంలో తోడుకోసం తాత ఆరాటం.. ఒంటరిగా ఉన్నా వధువు కావాలంటున్న 83 వృద్ధుడు

బెంగళూరులో నిర్వహించిన ఈ మ్యాచ్ మేకింగ్ ఈవెంట్‌లో కర్ణాటక నుంచి మాత్రమే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పాల్గొన్నారు. కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన ఓ గృహిణి తన వితంతువు తల్లిని తీసుకొచ్చింది. ఈ విషయంపై కూతురు స్పందిస్తూ.. తన తల్లికి అల్లుళ్లతో కలిసి జీవిచడం చాలా అసౌకర్యంగా ఉన్నదని.. అందుకే తన తల్లి తనతో, తన సోదరితో కలిసి జీవించడానికి నిరాకరించిందని తెలిపింది.

Viral News: వృధ్యాప్యంలో తోడుకోసం తాత ఆరాటం.. ఒంటరిగా ఉన్నా వధువు కావాలంటున్న 83 వృద్ధుడు
Marriage ProposalImage Credit source: Pexels
Surya Kala
|

Updated on: Feb 03, 2024 | 10:20 AM

Share

ఇప్పుడు పెళ్లిళ్లులను కురుస్తుంది మ్యారేజ్ బ్యూరో సంస్థలే.. యువతీ యువకుల తల్లిదండ్రులు పెళ్లి కోసం ఈ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మ్యారేజ్ ఈవెంట్ నిర్వాహకులు  ఒక అప్లికేషన్ చూసి షాక్ తిన్నారు. 83 ఏళ్ల వ్యక్తి పెళ్లి కూతురు కావాలంటూ  ధరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ చూసి ఆశ్చర్యపోయారు. తాను చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నందున భాగస్వామి కోసం వెతుకుతున్నానని వృద్ధుడు చెప్పాడు. ఈ కార్యక్రమం 50 ఏళ్లు పైబడిన వారి కోసం నిర్వహించబడింది. ఇందులో పురుషులు, మహిళలు కలిసి  మొత్తం 37 మంది పాల్గొన్నారు. పాల్గొనేవారిలో కొందరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరుకోగా.. ఇంకొందరు సహజీవనం కోసం మంచి భాగస్వామిని వెతుకుతున్నారు.

డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం బెంగళూరులో నిర్వహించిన ఈ మ్యాచ్ మేకింగ్ ఈవెంట్‌లో కర్ణాటక నుంచి మాత్రమే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పాల్గొన్నారు. కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన ఓ గృహిణి తన వితంతువు తల్లిని తీసుకొచ్చింది. ఈ విషయంపై కూతురు స్పందిస్తూ.. తన తల్లికి అల్లుళ్లతో కలిసి జీవిచడం చాలా అసౌకర్యంగా ఉన్నదని.. అందుకే తన తల్లి తనతో, తన సోదరితో కలిసి జీవించడానికి నిరాకరించిందని తెలిపింది. అయితే ఈ వయసులో మా అమ్మ ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు’ అని..  అందుకే అతనికి మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నానని వెల్లడించింది.

అదే సమయంలో ఈవెంట్‌కు వచ్చిన 83 ఏళ్ల వృద్ధుడు తాను ఒంటరిగా జీవిస్తున్నానని.. అందుకనే తన కోసం భాగస్వామిని వెదకడం కోసం ఇక్కడకి వచ్చినట్లు చెప్పాడు. అంతేకాదు తన భార్య 18 ఏళ్ల క్రితం చనిపోయింది. పిల్లలు విదేశాల్లో నివసిస్తున్నారు. తాను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని ఆ వృద్ధుడు చెప్పాడు. దీంతో తన కుమార్తె తనను ఈ ఈవెంట్ కు వెళ్ళమని ప్రోత్సహించింది. అయితే వృద్ధుడు కాస్త నిరాశ చెందాడు. ఎందుకంటే ఈవెంట్‌లో కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ తోడు-నిడా వ్యవస్థాపకురాలు ఎన్‌ఎం రాజేశ్వరి మాట్లాడుతూ.. ‘మహిళలు తక్కువగా ఉన్నారని ఫిర్యాదు చేయవద్దు.. ఎందుకంటే ఇక్కడికి రావడానికి ఇప్పుడు వచ్చిన మహిళలు చాలా ధైర్యం చూపించారని చెప్పారు. భాగస్వామిని వెదకడానికి వయసు అడ్డంకి కాదు. దేశంలో సహజీవనం చట్టవిరుద్ధం కాదు.. కనుక సొంత నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఈ NGO 2010 నుండి 50 ఏళ్లు పైబడిన వితంతువులకు లేదా విడాకులు తీసుకున్న వారికి 500 కంటే ఎక్కువ వివాహాలను, లివ్-ఇన్ సంబంధాలను సులభతరం చేసింది. ఈవెంట్ చివరికి కొందరి కలిపింది. కొందరు తమ భాగస్వామిని ఎంచుకుని సంతోషముగా వెళ్లగా.. మరికొందరు నిరాశగా వెనుదిరిగారు. నలుగురు వ్యక్తులు తమ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారని నిర్వాహకులు తెలిపారు. వారిలో ఇద్దరు ఇప్పుడు తమ కుటుంబాలను తమ రిలేషన్ షిప్ లో భాగస్వాములను చేయాలనుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..