సామాన్యులకు సోషల్ మీడియా బ్రహ్మస్త్రంగా మారిపోయింది. సామాజిక మద్యామాల్లో కొన్నిసార్లు హృదయాలను హత్తుకునే సంఘటనలు పోస్ట్ అవుతుంటే.. మరికొన్ని సార్లు ఇప్పుడు మనం చెప్పుకోబేవి కూడా షేర్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రజల్లోకి వేగంగా దూసుకుపోతున్నాయి. అయితే ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు పెద్ద వైరల్‌గా మారుతోంది. ఫ్లై ఓవర్ మీద వేగంగా వెళ్తున్న కారు.. బానెట్ మీద ఓ యువకుడు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజనం అయ్యో ఇదేంటి అంటూ పోస్టులు పెడుతున్నారు.
కాన్పూర్, లక్నో హైవేలోని జజ్మౌ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. బానెట్ మీద వేలాడుతున్న యువకుడు ప్రాణాల కోసం అరవడం అందరిని కలిచివేస్తోంది. ఐదు కిలోమీటర్ల వరకు ఇలాగే వేగంగా కారును దూకించాడు.
అయితే ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. కానీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన ప్రజలలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట అంతా ఇది సినిమా స్టంట్ అని అనుకున్నారు. కాని తరువాత రియాలిటీ అని తెలుసుకుని ఆశ్చర్య పోతున్నారు.
कानपुर-लखनऊ हाईवे के जाजमऊ फ्लाइओवर पर मंगलवार सुबह एक व्यक्ति को बोनट पर लटका कार ने 5KM तक फर्राटा भरा। कार की DCM से टक्कर होने पर कार सवार युवकों ने परिचालक को टक्कर मारना चाहा तो वो बोनट पर लटक गया। फिर युवक उसे घसीट ले गए। @kanpurpolice मामले की जांच कर रही है। @JagranNews pic.twitter.com/iOx78STr5r
— amit singh (@Join_AmitSingh) July 20, 2021
కారు యాజమాని, ట్రక్కు క్లీనర్ మధ్య జరిగిన గొడవ ఈ ఘటనకు దారితీసిందని తెలుస్తోంది. తన కారును ట్రక్కు క్లీనర్ మీద ఎక్కించేందుకు ప్రయత్నించాడంతో ఆగ్రహంతో ఇలా చేసినట్లుగా సమాచారం. అయితే తప్పించుకునే ప్రయత్నంలో బానెట్ మీద పడిపోయాడు.
ఇదే అదనుగా కారును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాడు ఆ కారు డ్రైవర్. కాన్పూర్-లక్నో హైవేపై ఉన్న ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలిసిన వాళ్లు సమాచారం తమకు అందించాలని పోలీసులు కోరారు.