ప్రస్తుతం పుష్ప మేనియా కొనసాగుతుంది. సోషల్ మీడియాలో పుష్ప ఈ సినిమా సాంగ్స్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పుష్ప మూవీలోని పాటలకు స్టెప్పులేస్తున్నారు. అల్లు అర్జున్.. రష్మిక.. సమంత వేసిన స్టెప్పులను ఫాలో అవుతూ నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు. ఎక్కడ విన్నా… చూసిన పుష్ప పాటలే. ఇప్పటికే ఖండాంతరాలను దాటి పుష్ప క్రేజ్ కొనసాగుతుంది. సామాన్యులే కాదు.. క్రికెటర్స్ కూడా పుష్ప రాజ్ స్టైల్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలోని వియన్నాకు చెందిన ఓ వ్యక్తి శ్రీవల్లి పాటకు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా లెవల్లో పుష్ప మూవీ భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మొదటి సారి ఊరమాస్ లుక్కులో బన్నీ తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప సినిమానే కాకుండా.. ఇందులోని పాటలు కూడా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. దాక్కో దాక్కో మేక.. శ్రీవల్లి.. సామి సామి.. ఊ అంటావా. ఊహు అంటావా పాటలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా శ్రీవల్లి పాటకు వియాన్నాకు చెందిన ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ నెటిజన్స్ దృష్టిని ఆకట్టుకుంటుంది. పుష్ప సినిమా చూసిన తర్వాత అందులోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేయకుండా ఉండలేకపోయానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. శ్రీవల్లి పాటకు బన్నీ స్టైల్లో డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..