
రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు, ఎలా ప్రమాదం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. చాలా సార్లు ఒక వ్యక్తి తన వైపు నుంచి పూర్తి జాగ్రత్త తీసుకుని ప్రయనిస్తాడు. అయితే మరొక వ్యక్తి చేసే తప్పు అతని ప్రాణాలను బలిగొంటుంది. ట్రక్కులు, బస్సులు వంటి పెద్ద వాహనాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా ప్రాణాంతకం కావచ్చు. అందుకు సజీవ సాక్ష్యం ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో..
ఒక ప్రమాదకరమైన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా షాక్ తినాల్సిందే. ఇందులో ఒక అమ్మాయి తన స్కూటీపై రోడ్డుపై ట్రాఫిక్ జామ్ నుంచి నెమ్మదిగా బయటపడటానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా ఆ యువతి వెనుక వస్తున్న ట్రక్ డ్రైవర్ అధిక వేగంతో స్కూటీపైకి ఎక్కాడు. ఈ దృశ్యం చాలా భయానకంగా ఉంది. చూపరులు ఊపిరి పీల్చడం కూడా మరచిపోయి ఉంటారు.
लगता है एक खरोंच भी नहीं आया लड़की को pic.twitter.com/ecp32xYjPq
— Hurr (@IAmHurr07) August 15, 2025
ట్రక్కు కింద పడిన యువతి
అయితే ఆ యువతి అదృష్టవశాత్తూ ట్రక్కు చక్రాల కింద పడలేదు. ఆమె ట్రక్కు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. ఆమె చక్రాల కింద పడి ఉంటే.. ఆమె అక్కడికక్కడే చనిపోయేది. ప్రమాదంలో ఆమె స్కూటీ పూర్తిగా ముక్కలైంది.. కానీ ఆ అమ్మాయి సురక్షితంగా బయటపడింది.
ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @IAmHurr07 అనే ఖాతాలో షేర్ చేశారు. వీడియో క్యాప్షన్ “ఆ అమ్మాయి శరీరంపై ఒక్క గీత కూడా పడనట్లు ఉంది.” కేవలం 13 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వీక్షించారు. వందలాది మంది యూజర్లు దీన్ని లైక్ చేసి కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక యూజర్ ఇలా వ్రాశాడు, “అమ్మాయి స్కూటీ పూర్తిగా విరిగిపోయింది.. పోనీలే ఆ అమ్మాయి ప్రాణం కాపాడబడింది. నిజమే.. పై వాడి నుంచి పిలుపు వచ్చే వరకు ఏమీ తప్పు జరగదు.” అని కామెంట్ చేశారు. అదే సమయంలో మరొక యూజర్ సైకిల్ , స్కూటీ రైడర్లు ఎప్పుడూ ట్రక్కు దగ్గరగా వెళ్లకూడదు. ట్రక్కులు ఎత్తుగా ఉంటాయి. అందుకే డ్రైవర్ కిందకి స్పష్టంగా చూడలేడు.”
డ్రైవర్ నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం
మరోవైపు ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి డ్రైవర్లు రోడ్డుపై వెళ్లే ఎవరికైనా ప్రమాదకరంగా మారవచ్చని అంటున్నారు. భవిష్యత్తులో ఎవరైనా అలాంటి పని చేసే ముందు వందసార్లు ఆలోచించేలా ఇలాంటి రాష్ డ్రైవర్‌కు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని కొందరు పేర్కొన్నాడు. ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఏమిటంటే.. రోడ్డుపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..