viral video: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక మిలిటరీ జెట్ విమానం ఆకాశంలో పక్షి ఢీ కొనడంతో కూలిపోయిన దృశ్యాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. కొత్తగా విడుదల చేసిన ఈ వీడియో గత సంవత్సరం సెప్టెంబర్‌లో లేక్ వర్త్ పరిసరాల్లో జరిగిన సంఘటనకు సంబంధించినది. అప్పట్లో విమానం కూలిపోయే ముందు మిలిటరీ ట్రైనింగ్ జెట్ ఫ్లైట్ పక్షిని ఢీకొట్టింది. నావల్ ఎయిర్ ట్రైనింగ్ చీఫ్ సోమవారం కాక్‌పిట్ వీడియోను విడుదల చేశారు. క్రాష్ జరిగిన ఒక సంవత్సరం తర్వత గతంలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు.
యుఎస్ మిలిటరీ ఇటీవల విడుదల చేసిన వీడియోలో.. నేవీ T-45C గోషాక్ కార్పస్ క్రిస్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి ఒక సాధారణ శిక్షణా విమానంలో గాల్లో ఎగురుతుంది. అది నావల్ ఎయిర్ స్టేషన్ జాయింట్ రిజర్వ్ బేస్ ఫోర్ట్ వర్త్‌కు ఉత్తరాన ఒక మైలు దూరంలో ఉండగా, పెద్ద పక్షి ఢీకొట్టింది. వీడియోలో కాక్‌పిట్‌లో అలారాలు మోగడానికి ముందు పైలట్‌లలో ఒకరు గట్టి గట్టిగా కేకలు వేయడం వినిపించింది. ‘మేము దానిని రన్‌వేకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము’ అని ఒక పైలట్ వాయిస్ రేడియోలో వినబడింది. “అవును.. మేము దానిని చేయలేకపోయాము..మేము ఎజెక్ట్ చేయబోతున్నాము..’ అని పైలట్ సెకన్ల తర్వాత విమానం దిశమార్చుకుని మరో ప్రాంతం వైపు వేగంగా కిందకు దూసుకెళ్లింది.
Lake Worth, Texas: New video released by the military shows the moment a bird flew into a military jet last year, which caused it to crash into a Lake Worth neighborhood and cause major damage to a home.
The crash happened back on September 19, 2021 pic.twitter.com/4zIt0rTFYE
— PXP Security & Inves (@PXPSecurityInve) September 19, 2022
విమానం కూలిపోవడానికి కొన్ని సెకన్ల ముందు పైలట్‌లు ఇద్దరూ విమానం నుండి బయటపడగలిగారు. యుఎస్ మిలిటరీ ఇటీవల విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒక సంవత్సరం తర్వాత విమాన ప్రమాదానికి గల కారణాలు బయటపడ్డాయి. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి