Viral Video: అరే ఏంట్రా ఇది.! కుక్కను ఇంప్రెస్ చేసేందుకు యువతి డ్యాన్స్ షో.. చూస్తే నవ్వాపుకోలేరు!
సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే..
సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూశాక మీరూ అస్సలు నవ్వాపుకోలేరంతే.!
వైరల్ వీడియో ప్రకారం.. పొలం గట్టు దగ్గర ఓ యువతి.. డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆ యువతి డ్యాన్స్‌కు ముందున్న కుక్క తెగ ఇంప్రెస్ అయి.. అదే పనిగా తోక ఊపుతోంది. ఇక వెనుక ఉన్న అమ్మాయిలు మాత్రం ఆమె డ్యాన్స్ షోను ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ పాపం! కుక్కను ఇంప్రెస్ చేసేందుకు మరీ ఇంతలా డ్యాన్స్ చేయాలా’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.
View this post on Instagram