సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతుంది. వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని చాలా అందంగా ఉంటాయి. తరచుగా మనం మళ్లీ మళ్లీ చూడాలనుకునే వీడియోలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు మన మనసులో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఒక అద్బుత మైన, అంద మైన వీడియో సోషల్ మీడియా వేదికపై వైరల్ అవుతుండగా, దాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి సంబంధించినది. ఎవరెస్ట్ శిఖరంపై నిలబడి తీసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. శిఖరం మీద నిలబడి భూమి అద్భుతమైన అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఎవరెస్ట్‌ను అధిరోహించాలని ఎంత మంది ప్లాన్‌లు ప్రారంభించారో ఎవరికి తెలియదు. కానీ, అక్కడికి చేరుకోవడం అందరికీ సాద్యం కాదు, చాలా మంది ప్రయత్నించినా ఈ శిఖరాన్ని చేరుకోలేకపోతున్నారు.
మౌంట్ ఎవరెస్ట్ మునుపెన్నడూ చూడని అందమైన దృశ్యం..
వైరల్ అవుతున్న వీడియోలో, ఎవరెస్ట్ శిఖరాన్ని 360 డిగ్రీల కోణంలో కెమెరా బంధించింది. ఈ దృశ్యం చూస్తుంటే మన కళ్లను మనమే నమ్మడం కష్టంగా ఉంది. ఈ వీడియోను పర్వతారోహకులు షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, అతను రాశాడు – ఎవరెస్ట్ శిఖరం నుండి 360 డిగ్రీల కెమెరా వీక్షణ. ఈ వీడియోలో పర్వతారోహకుడు శిఖరంపై నిలబడి కనిపించాడు. దీని తరువాత, మీరు అక్కడ నుండి కిందకు చూస్తే, నేలపై మీకు భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది.
A 360° camera view from the top of Mt Everest pic.twitter.com/bhb4wLNkJc
— Ashraf El Zarka (@aelzarka) December 21, 2022
ఈ వీడియో చూసిన వారంతా చాలా కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా రాశారు.. భూమి చదునుగా లేదని. మరొకరు రాశారు, ఇప్పుడు మనం ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నాము..మనమే గెలిచాము అంటూ వ్యాఖ్యనించారు. కానీ, ఈ వీడియో 2022 సంవత్సరానికి చెందినదిగా తెలిసింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. మౌంట్ ఎవరెస్ట్ అందాలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..