పెళ్లిళ్లలో బ్యాండ్, బాజా, డీజే లాంటివి సర్వసాదారణంగానే ఉంటాయి. అవి లేకుండా పెళ్లి అసంపూర్తిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు శబ్దం లేని వివాహాలు చేస్తున్నారు కొందరు ప్రజలు. అలాంటి ఒక వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డప్పులు, సంగీత వాయిద్యాలు, డీజే లేకుండా పెళ్లి ఊరేగింపును మీరు ఎప్పుడైనా చూశారా..? ఈ పెళ్లిలో ఎలాంటి బ్యాండ్ లేదా DJ వంటివి ఉపయోగించలేదు. అయినప్పటికీ పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. సైలెంట్ పెళ్లిలో గెస్ట్‌ల హంగామా ఎలా ఉందో చూపించే వీడియో వైరల్ అవుతోంది. నిశ్శబ్ద వివాహానికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు..
సైలెంట్ పార్టీ క్లబ్‌లు కూడా కొన్ని ఉన్నాయి. అక్కడికి వచ్చే గెస్ట్‌లందరికీ హెడ్‌ఫోన్స్ ఇస్తారు.. వారంతా చెవుల్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకోగానే మ్యూజిక్ ప్లే అవుతుంది.. దాంతో వారు ఆ పాటకు తగ్గ డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తారు.. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి హెడ్‌ఫోన్‌లు ఉంటాయి. అన్ని హెడ్‌ఫోన్‌లు ఒకే మ్యూజిక్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి.. అందరూ ఒకే పాటను ఒకేసారి వింటారు. అదేవిధంగా ఇక్కడ ఒక వివాహం జరిగింది. ఈ పెళ్లిలో బ్యాండ్ బజా లేదు.. డబ్బు, DJ, వాయిద్యాలు లేవు. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో హెడ్‌ఫోన్ ఇచ్చారు. దాంతో అందరూ మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ ఊరేగింపులో ఎలాంటి శబ్ద కాలుష్యం లేదు. ఈ సైలెట్ వెడ్డింగ్ బారాత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలా పెళ్లికి వచ్చిన అతిథులకు హెడ్ ఫోన్స్ ఇస్తే సగం హెడ్ ఫోన్స్ మాయమైపోతాయని ఒకరు రాశారు. వాళ్లంతా అలా ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారో తెలియక పోతే..వారిని పిచ్చి వారిగా పిలుస్తారని ఒకరు రాశారు.
అయితే, ఈ వింత పెళ్లి ఊరేగింపు వెనుక అసలు విషయం ఏంటంటే… ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా పెళ్లి ఊరేగింపు వెళ్లే చోట క్యాన్సర్ ఆసుపత్రి ఉందని అమ్మాయి చెప్పింది. అటువంటి పరిస్థితిలో, DJ లేదా ఏ రకమైన సౌండ్‌కు అనుమతి లేదు. అందుకే ఇలా వెరైటీగా సైలెంట్ బారాత్ ప్లాన్ చేసినట్టుగా చెప్పారు.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..