Viral Video: రైతు కడుపు మండితే ఇలాగే ఉంటది.. చేతికందిన పంటకు ధర లేదని ఏం చేశారంటే..

| Edited By: Janardhan Veluru

Aug 20, 2022 | 12:13 PM

వెల్లుల్లి ధర మరింత దారుణంగా పడిపోయింది. పడిపోవడం అంటే ఒకటి, రెండు రూపాయలు పడిపోవడం కాదు.. ఏకంగా రూపాయల నుంచి పైసల్లోకి జారిపోయింది.

Viral Video: రైతు కడుపు మండితే ఇలాగే ఉంటది.. చేతికందిన పంటకు ధర లేదని ఏం చేశారంటే..
Garlic
Follow us on

రైతుల ఓపిక నశిస్తోంది. ఎండకు.. వానకు కష్టించి వ్యవసాయం చేసే రైతులకు అనునిత్యం ఆందోళనే మిగులుతోంది. విత్తనం వేసింది మొదలు..  పూతకో రోగం, కాతకో కయ్యం.. తీరా పంట చేతికందే దశలో ఏ అకాలవర్షానికో తడిసిపోతే.. ఇలా దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి. ఆరుగాలం కష్టించి పండించే పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ఇదంతా గతం కాదు.. ఇప్పడు ఇలానే ఉంటోంది. మొన్నటికి మొన్న టమోటా ధర పడిపోతే.. ఇవాళ వెల్లుల్లి ధర మరింత దారుణంగా పడిపోయింది. పడిపోవడం అంటే ఒకటి, రెండు రూపాయలు పడిపోవడం కాదు.. ఏకంగా రూపాయల నుంచి పైసల్లోకి జారిపోయింది. రెట్టింపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతున్నా.. రైతులు పండించిన పంటకు కూడా గిట్టుబాటు రావడం లేదు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఓ వైపు ప్రభుత్వం హామీలు గుప్పిస్తూనే మరోవైపు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించలేకపోతోంది. కోటి ఆశలతో వెల్లుల్లి పంట వేసిన రైతులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. దీంతో ఎన్నో కష్టాలకు ఓర్చి పండించిన పంటను గంగమ్మ ఒడికిలో పారపోతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని సెహోర్ – రాజ్‌గఢ్ జిల్లాల మధ్య ఉన్న వంతెనపై నుంచి పార్వతి నదిలోకి వెల్లుల్లి సంచులను రైతులు విసిరే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాల్వా ప్రాంతంలో వెల్లుల్లి సాగు చేసిన రైతులకు నిరాశే ఎదురైందని ఆ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెహోర్‌లో ఆగ్రహించిన రైతులు ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్లను ఘెరావ్ చేసిన ఘటనలు మరిచిపోకముందే ఇలాంటి వీడియో ఒకటి బయటికొచ్చింది. మార్కెట్లో పలుకుతున్న ధర గిట్టుబాటు కాకపోవడంతో చేతికొచ్చిన పంటను రోడ్లపై, నదుల్లో పారబోస్తున్నారు. పంటను ఎగమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో ‘వ్యాపారులు కిలో వెల్లుల్లి రూ.1 నుంచి 4కే కొంటున్నారు. కానీ కిలో వెల్లుల్లి ఉత్పత్తి చేసేందుకు తమకు రూ.30 నుంచి రూ.40 ఖర్చవుతున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు మాటలు ఈ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ వీడియోను కిసాన్ స్వరాజ్ సంఘటన్ (KSS) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఉల్లి, వెల్లుల్లిని తక్షణమే ఎగుమతి చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌లకు ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఒక క్వింటాల్ ఉల్లి ఉత్పత్తికి రూ.2000 ఖర్చవుతుండగా, మార్కెట్‌లో రూ.500-800 ధర పలుకుతున్నట్లు వీరు పేర్కొన్నారు.

ప్రభుత్వం స్మార్ట్ సిటీలు, మినీ సిటీల గురించి మాట్లాడుతుంది. కానీ భారతదేశంలోని 70 శాతం వ్యవసాయ ఆధారిత జనాభా ప్రాథమిక సౌకర్యాలకు దూరంగా ఉంది. మాల్వా బెల్ట్‌లో, ప్రతి చిన్న, పెద్ద తరగతి రైతు సామర్థ్యం ప్రకారం వెల్లుల్లి, ఉల్లి సాగు చేస్తారు. కానీ వెల్లుల్లి ధర లభించకపోవడంతో రైతులు కంగుతిన్నారు.

సమస్యను త్వరగా పరిష్కరించకుంటే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగుతామని ఆందోళన చేస్తున్న రైతులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం