Viral Video: కోడి యాక్టింగ్ చూస్తే పక్కా ఫిదా.. నెటిజన్ల మనసు దోచుకుంటున్న వీడియో

|

Jul 03, 2022 | 11:36 PM

జంతువులను మచ్చిక చేసుకోవడం కాస్త కష్టమే. కానీ ఒక సారి మచ్చిక చేసుకున్నామంటే.. అవి మన ఇంట్లో సభ్యుల్లా మారిపోతాయి. కలిసి కూర్చోవడం, కలిసి తినడం, కలిసి పడుకోవడం....

Viral Video: కోడి యాక్టింగ్ చూస్తే పక్కా ఫిదా.. నెటిజన్ల మనసు దోచుకుంటున్న వీడియో
Hen Video Viral
Follow us on

జంతువులను మచ్చిక చేసుకోవడం కాస్త కష్టమే. కానీ ఒక సారి మచ్చిక చేసుకున్నామంటే.. అవి మన ఇంట్లో సభ్యుల్లా మారిపోతాయి. కలిసి కూర్చోవడం, కలిసి తినడం, కలిసి పడుకోవడం వంటి పనులు చేస్తూ మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలా ఏదైనా నేర్చుకోవడం కుక్కలు ముందువరసలో ఉంటాయి. జంపింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, వంటివి నేర్పిస్తే అవి సులభంగా నేర్చుకుంటాయి. అయితే మీరు ఎప్పుడైనా ‘కాపీ క్యాట్’ కోడిని చూశారా? అవును, మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తిని కాపీ కొడుతున్న కోడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు. లైక్ లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కాలు విరిగిన ఓ వ్యక్తి కర్ర సహాయంతో కుంటుతూ నడుస్తున్నాడు. అతని వెనుక కోడి కూడా అలా ఒంటికాలిపై నడవడానికి ప్రయత్నిస్తోంది. ఆ వ్యక్తి ఎలా నడుస్తున్నాడో, అచ్చం అదే స్టైల్‌లో నడుస్తోంది.

దీనిని గమనించిన ఆ వ్యక్తి.. ఆ కోడిని కొట్టేందుకు కర్ర తీసుకుంటాడు. ఇది చూసిన కోడి వెంటనే అక్కడ నుంచి పారిపోతుంది. పిల్లలు ఇలా అల్లరి చేయడం సాధారణమే. కానీ ఈ కోడి వారి కంటే ఒక అడుగు ముందుకేసింది. అల్లరి విషయంలో పిల్లలనూ మించిపోయింది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 13 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 60 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 10 వేల మందికి పైగా నెటిజన్లు వీడియోను లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి