Funny Dance: టిక్‌టాక్ బూతం ఇంకా వదిలినట్లు లేదు.. వైరల్ అవుతున్న ‘హెవీ డ్యాన్సర్’ వీడియో..

ఈ రోజుల్లో పెళ్లి అంటే డ్యాన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా గ్రామాల్లో డ్యాన్స్ కార్యక్రమాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే  ప్రస్తుతం ఓ మహిళ చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆ మహిళ..

Funny Dance: టిక్‌టాక్ బూతం ఇంకా వదిలినట్లు లేదు.. వైరల్ అవుతున్న ‘హెవీ డ్యాన్సర్’ వీడియో..
Woman Dance Video

Updated on: Dec 20, 2022 | 11:37 AM

డ్యాన్స్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా బాగుంటే మరికొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక ఈ రోజుల్లో పెళ్లి అంటే డ్యాన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా గ్రామాల్లో డ్యాన్స్ కార్యక్రమాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే  ప్రస్తుతం ఓ మహిళ చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆ మహిళ డ్యాన్స్ వేసింది అనేకంటే గంతులేసింది అనడమే సబబు. మీరు కనుక డ్యాన్స్‌ను ఇష్టపడేవారు అయితే  ఈ వీడియోను చూసి పడిపడి నవ్వేసుకుంటారు.

అయితే videonation.teb అనే ఇన్‌స్టా ఖాతా నుంచి ‘‘ కప్ప గంతులా లేక ఏమిటి..?’’ అనే కాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోలో ఒక మహిళా డ్యాన్సర్ హై జంప్ స్టైల్‌లో ఎగురుతూ స్టేజ్ మొత్తం తిరగాడడం మనం చూడవచ్చు. అది కూడా చాలా అంటే చాలా వేగంగా కూర్చుని గంతులేసుకుంటూ స్టేజీని చుట్టేసింది ఆ డ్యాన్సర్. తర్వాత లేచి నిలబడి గుండ్రంగా తిరగడం ప్రారంభిస్తుంది. మీరు చాలా రకాల డ్యాన్స్ వీడియోలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి వీడియోను ఇదే మొదటిసారిగా చూడబోతున్నారని మేము గట్టిగా చెప్పగలం.

ఇవి కూడా చదవండి

‘హెవీ డ్యాన్సర్’ వీడియో..

కాగా, ఈ వీడియోను చూసి నెటిజన్లు నవ్వలేకపోతున్నారు. వారి స్పందనలు కూడా చాలా సరదాగా ఉంటున్నాయి. ‘హెవీ డ్యాన్సర్’ అని కొందరు అంటుంటే.. ‘ఆమె గెంతడాన్ని చూస్తుంటూ హెవీ డ్యాన్సర్‌గా అనిపించడం లేదు. ఆమెకు టిక్‌టాక్ బూతం ఇంకా వదిలినట్లుగా లేద’ని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంకొందరు అయితే ‘ఎత్తును పెంచడానికి ఇది గొప్ప ట్రిక్. అందుకే ఆమె హైట్‌గా ఉంది’ అని రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..