Funny Video: ప్రేమలో పడితే ఇంతేనేమో..! ఈ యువకుడి మాటలు ఓ సారి వినండి.. ఫుల్‌గా నవ్వేసుకుంటారు..

మనలో చాలా మంది ప్రేమలో పడగానే తమతో ఉండే స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించేస్తారు.  చదవడానికి నిజం అనిపించకపోయినా చాలా మంది విషయంలో జరిగేది ఇదే. ముఖ్యంగా అబ్బాయిలకు తమ స్నేహితులతో గడిపే సమయం దొరకడం కష్టమేనని చెప్పుకోవాలి. ఇక..

Funny Video: ప్రేమలో పడితే ఇంతేనేమో..! ఈ యువకుడి మాటలు ఓ సారి వినండి.. ఫుల్‌గా నవ్వేసుకుంటారు..
Youngster On Call With His Gf

Updated on: Apr 09, 2023 | 6:15 AM

Funny Video: మనలో చాలా మంది ప్రేమలో పడగానే తమతో ఉండే స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించేస్తారు.  చదవడానికి నిజం అనిపించకపోయినా చాలా మంది విషయంలో జరిగేది ఇదే. ముఖ్యంగా అబ్బాయిలకు తమ స్నేహితులతో గడిపే సమయం దొరకడం కష్టమేనని చెప్పుకోవాలి. ఇక వారికి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లే తీరిక లభించడం చాలా అరుదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ప్రేమికుడి కష్టాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో అతను తన స్నేహితులతో గడపాలని టూర్ వెళ్తాడు.

అయితే అతని లవర్ కాల్ చేసి మాట్లాడాలని కోరుతుంది. స్నేహితులతో సెల్ఫీ తీసుకుని వస్తానని పర్మిషన్ అడిగినా కూడా.. అతని ప్రేయసి అందుకు ఒప్పుకోదు. ఇంకా ఈ సమయంలో అతని స్నేహితులు, అతన్ని సెల్ఫీ దిగడానికి రావాలని పిలుస్తారు. ఈ క్రమంలో అతను తన లవర్‌తో ‘నా స్నేహితులతో కలిసి ఒక్క సెల్ఫీ కూడా లేదు. ఒక్కటి తీసుకుని వస్తాన’ని అడుగుతాడు. అయినా కూడా ఆమె అందుకు అంగీకరించదు. దీంతో అతను ‘సరే మాట్లాడు’ అనుకుంటూ బాధపడుతూ చెప్తాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి…

మరోవైపు ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు అతని పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమలో పడితే ఇంతేనని కొందరు, ఆ అమ్మాయి ఇలా ప్రవర్తించడం తప్పు అని  మరి కొందరు చెబుతున్నారు. ఇంకా కొందరు నెటిజన్లు అయితే తమకు ఇలాంటి సమస్యలే ఉన్నాయని, వివిధ ప్రదేశాలకు వెళ్లినప్పుడు తమ లవర్స్‌తో ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయని తెలిపారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.