
భారతీయ రైల్వేలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ఆరంభంలో కాస్త ఆక్యూపెన్సీ తక్కువగా ఉన్నా.. తర్వాత తర్వాత పుంజుకొని ఇప్పుడు ఆ ట్రైన్లు కూడా ఫుల్ అవుతున్నాయి. మంచి సౌకర్యాలతో, గమ్యస్థానాలకు వేగంగా చేరుతుండటంతో చాలా మంది ప్రయాణికులు వందే భారత్ రైళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే రైళ్లో ప్రయాణిస్తున్న సమయంలో చాలా మంది మధ్యలో వచ్చే స్టేషన్స్‌లో ట్రైన్ ఆగితే సరదాగా కిందికి దిగుతుంటారు.
కొంత మంది నీళ్ల కోసమో, టీ కోసమో దిగుతారు. ట్రైన్ తక్కువ సమయమే ఆగుతుందని తెలిసినా కూడా రిస్క్ తీసుకొని దిగుతారు. ఒక వేళ ట్రైన్ కాస్త మూవ్ అయినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కొచ్చనే ధీమా ఉంటుంది. కానీ, వందే భారత్‌లో అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ట్రైన్ కదిలే ముందే డోర్లు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రైన్ మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
వందే భారత్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి. మధ్యలో ఓ స్టేషన్‌లో ట్రైన్ ఆగడంతో టీ తాగుదామని కిందికి దిగాడు. టీ కప్పు కూడా తెచ్చుకొని ట్రైన్ ఎక్కుదాం అనుకునే లోపే దాని డోర్లు ఆటోమేటిక్‌గా మూసుకున్నాయి. దీంతో అతను వెంటనే ఆ టీ కప్పును కింద పడేసి.. ఇంజన్‌వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే ట్రైన్ కదిలింది. దీంతో అతను తన ట్రైన్ మిస్ అయి ప్లాట్‌ఫామ్‌పైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా వందే భారత్ ట్రైన్స్‌లో ప్రయాణించే వారికి ఈ వీడియో ఒక అలర్ట్ లాంటిది. మధ్యలో వచ్చే స్టేషన్స్‌లో కిందికి దిగకపోవడం ఉత్తమం. లేదంటే ఇతని లాగే మీరు కూడా ట్రైన్ మిస్ అయ్యే అవకాశం ఉంది.
A passenger got off the Vande Bharat train to get tea but was left outside as the automatic doors were closed. pic.twitter.com/Q1CYe44zie
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 7, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి