US News Update: తమ అనుకున్న వాళ్లు మధ్యలోనే చనిపోతే.. ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటి డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే చాలా సమయం పడుతుంది. ఈ తరుణంలోనే మనకు క్లోజ్‌గా ఉండే వాళ్లు మనల్ని ఓదార్చుతారు. తద్వారా మనకు కొంత రిలీఫ్ దక్కుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. భర్త చనిపోయిన టీచర్‌ను ఓ స్టూడెంట్ అందమైన లేఖ ద్వారా ఓదార్చాడు. ఇక ఆ లేఖను సదరు టీచర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని ఓ పాఠశాలలో మెలిస్సా మిల్నర్ అనే మహిళ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆరోగ్య సమస్యలు కారణంగా ఇటీవల ఆమె భర్త మృతి చెందాడు. దీనితో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దానిని గమనించిన ఓ స్టూడెంట్ ఆమెను ఓదార్చేందుకు ఓ అందమైన లేఖ రాశాడు. ఆ లేఖలో టీచర్‌పై ఉన్న గౌరవాన్ని తెలియజేశాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ లేఖను ఓసారి చూడండి…
”ప్రియమైన మిసెస్ మిల్నర్, మీరు భర్తను కోల్పోయినందుకు నేను చాలా బాధపడుతున్నా. మిస్టర్ మిల్నర్ మీరు మళ్లీ చూడకపోవచ్చు. కానీ మీ హృదయాలను కనెక్ట్ చేసే ఓ లైన్ ఉంటుందని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీరు త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నా..” అంటూ ఆ స్టూడెంట్ లెటర్‌లో పేర్కొన్నాడు. ఈ లెటర్‌కు సోషల్ మీడియాలో లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి.
Also Read:
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!
As I grieve the sudden death of my husband, my students warm my heart. #grief #love #loss pic.twitter.com/v1SUmw4m5l
— Melissa Milner (@melissabmilner) February 28, 2021