AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేద కూలీ పెళ్లికి స్నేహితుల సర్‌ఫ్రైజ్‌ గిఫ్ట్‌.. 100 మంది అతిథులతో స్టైలిష్‌గా వెళ్లాడు..

పెళ్లి ఊరేగింపులో వరుడు తన వధువును ఎలా తీసుకువెళతాడు? చాలా సందర్భాల్లో గుర్రం, కారుపై వస్తారు. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వరుడు చాలా మందికి భిన్నంగా తన వధువును ఈ-రిక్షాలో తీసుకెళ్లడానికి బయలుదేరాడు. ఈ ఊరేగింపు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఆ ఊరెగింపు కనుచూపు మేరకు రహదారి పొడవునా సాగింది. మీరు కూడా ఈ కథను చూడాలి.

పేద కూలీ పెళ్లికి స్నేహితుల సర్‌ఫ్రైజ్‌ గిఫ్ట్‌.. 100 మంది అతిథులతో స్టైలిష్‌గా వెళ్లాడు..
Groom Arrives In Wedding
Jyothi Gadda
|

Updated on: Dec 02, 2025 | 8:19 PM

Share

సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించి చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు పెళ్లి ఊరేగింపుకు సంబంధిచిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పెళ్లి అంటే చుట్టాలు, బంధువులు, బాజా భజంత్రీలు, పురోహితుడు, వధూవరులు, తాళిబొట్టు, మూడు ముళ్లు, తాలంబ్రాలు, ఏడు అడుగులు అనంతరం బరాత్‌ ఊరేగింపు. ఈ పెళ్లి ఊరేగింపులో వరుడు తన వధువును ఎలా తీసుకువెళతాడు? చాలా సందర్భాల్లో గుర్రం, కారుపై వస్తారు. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వరుడు చాలా మందికి భిన్నంగా తన వధువును ఈ-రిక్షాలో తీసుకెళ్లడానికి బయలుదేరాడు. ఈ ఊరేగింపు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఆ ఊరెగింపు కనుచూపు మేరకు రహదారి పొడవునా సాగింది. మీరు కూడా ఈ కథను చూడాలి.

వివాహ ఊరేగింపులో వరుడు గుర్రం, లగ్జరీ కార్లలో వెళ్తాడు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వరుడు తన వివాహ ఊరేగింపును ఈ-రిక్షాపై తీసుకెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వివాహ ఊరేగింపు అందరికీ ఆకర్షణీయంగా మారింది. ఈ కథ సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టించింది. డియోరియాలో నివసిస్తున్న నిరుపేద యువకుడు దుర్గేష్ కూలీ పనులు చేస్తూ జీవించేవాడు. కానీ, అతనికి తన పెళ్లి ఊరేగింపు గొప్పగా ఉండాలని కలలుగనేవాడు. అతను తన పెళ్లి ఊరేగింపును కారులో తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ అతని దగ్గర కారు లేదు. అంత స్థోమత కూడా లేదు. కాబట్టి అతను ఏమి చేయలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

కానీ, దుర్గేష్ స్నేహితులు ఈ విషయం తెలుసుకున్నారు. వారు తమ స్నేహితుడు బాధపడటం చూడకూడదని అనుకున్నారు. వెంటనే వారంతా కలిసి వరుడు దుర్గేష్‌కు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ప్లాన్‌ చేశారు. వారంతా కలిసి భారీ ఈ-రిక్షాలతో ఊరేగింపు ర్యాలీ ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు, మూడు కాదు.. ఒకటి, తరువాత రెండు, అలా మొత్తం 30 ఈ- రిక్షాలను ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది వివాహ అతిథులు ఈ వివాహ వేదికకు హాయిగా చేరుకోగలిగారు.

దుర్గేష్ వివాహ ఊరేగింపు ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. రోడ్డుపై ఊరేగింపు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఈ పెళ్లి గురించిన పోస్ట్ వైరల్‌గా మారడంతో ప్రజలు దీనిని స్నేహానికి ఉదాహరణగా పిలుస్తున్నారు. డబ్బు కంటే ముఖ్యమైనది ఏదైనా ఉంటే, అది స్నేహితుల మద్దతు అంటూ చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..