AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Chikiri Song: రామ్ చరణ్ చికిరి సాంగ్‌కు బామ్మ సూపర్ డ్యాన్స్.. వీడియో చూస్తే వావ్ అంటారు

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉ్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Peddi Chikiri Song: రామ్ చరణ్ చికిరి సాంగ్‌కు బామ్మ సూపర్ డ్యాన్స్.. వీడియో చూస్తే వావ్ అంటారు
Peddi Chikiri Song
Basha Shek
|

Updated on: Dec 02, 2025 | 8:33 PM

Share

‘చికిరి… చికిరి..’ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. శుభకార్యాలు, పెళ్లి వేడుకలు.. ఇలా ఏ ఫంక్షన్ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పాటకు సంబంధించిన రీల్స్, రీక్రియేషన్ వీడియోలే కనిపిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన ఎనర్జిటిక్‌ స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే చికిరి సాంగ్ కు విప‌రీత‌మైన క్రేజ్ పెరిగింది. యూట్యూబ్‌లో కూడా ఈ పాట వ్యూస్ వేగంగా పెరుగుతూ 100 మిలియన్ మార్క్(10 కోట్ల‌) ను దాటేసింది. ఈ క్రమంలో చాలా మంది చికిరి సాంగ్ కు రీల్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ లాగే ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ చేస్తూ ఈ సూపర్ హిట్ సాంగ్ ను రీక్రియేట్ చేస్తున్నారు. అలా తాజాగాఓ బామ్మ పెద్ది సాంగ్ కు అద్దిరిపోయే స్టెప్పులేసింది. ఓ ఫంక్షన్ లో భాగంగా చికిరి సాంగ్ కు అద్బుతంగా డ్యాన్స్ చేసింది. అచ్చం రామ్ చరణ్ లానే ఎనర్జిటివ్ మూవ్ మెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. వయసుతో సంబంధం లేకుండా ఆ బామ్మ చూపించిన ఎనర్జీ, ఎక్స్ ప్రెషన్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ బామ్మకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు బామ్మ పై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా పెద్ది సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పెద్ది సినిమా వచ్చ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌