Unique Wedding Card viral: నెట్టింట వైరల్‌గా మారిన పెళ్లి కార్డు.. వధూవరులపై ప్రశంసల వెల్లువ

అయితే ఇలాంటి వెరైటీ వెడ్డింగ్‌ కార్డులు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా ఇలాంటి కార్డులు చాలా వచ్చాయి. ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ కార్డు చూసిన నెటిజన్లు నూతన వధూవరుల ఆదర్శాన్ని అభినందిస్తున్నారు. ఒక గొప్ప వ్యక్తిని గౌరవిస్తూ వారు తమ పెళ్లి కార్డుపై ముద్రించిన తీరుకు ప్రజలు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లైకులు,షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ

Unique Wedding Card viral: నెట్టింట వైరల్‌గా మారిన పెళ్లి కార్డు.. వధూవరులపై ప్రశంసల వెల్లువ
Wedding Party

Updated on: Feb 06, 2025 | 1:03 PM

పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. పెళ్లి కార్డులు బంధువుల ఇళ్లకు చేరుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వివాహ ఆహ్వాన పత్రిక అందంగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో, ఇంటర్‌లో వెలుగులోకి వచ్చిన ఓ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లి కార్డు అనగానే, గణపతి, వెంకటేశ్వరుడు, సీతారాముల ఫోటోలతో ముద్రిస్తారు. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న ఈ కార్డులో వధూవరుల ఫోటో, గణేశుడు వంటి ఏ ఇతర దేవతా మూర్తుల ఫోటోలు లేవు..కానీ, ఓ గొప్ప స్పూర్తిదాయక వ్యక్తి ఫోటోతో తయారు చేసిన ఈ కార్డు మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. విపరీతంగా వైరల్‌ అవుతున్న ఈ కార్డు వివరాల్లోకి వెళితే..

సాధారణంగా హిందూ మతంలో వివాహ కార్డుపై గణేశుడి ఫోటోను ముద్రిస్తారు. కానీ రాజస్థాన్ కు చెందిన ఒక జంట వెడ్డింగ్‌ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో దేవతామూర్తుల ఫోటోలకు బదులుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఫోటో ఉంది. కార్డుపై వధువు పేరు నిషా, వరుడి పేరు రాజ్‌కుమార్ అని వ్రాయబడింది. ఈ వివాహం గురువారం అంటే 2025 ఫిబ్రవరి 13న జరగనుంది. వాలెంటైన్స్ డే కి ఒక రోజు ముందు ఈ జంట పెళ్లి చేసుకోనున్నారు.

Unique Wedding Card

అయితే ఇలాంటి వెరైటీ వెడ్డింగ్‌ కార్డులు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా ఇలాంటి కార్డులు చాలా వచ్చాయి. ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ కార్డు చూసిన నెటిజన్లు నూతన వధూవరుల ఆదర్శాన్ని అభినందిస్తున్నారు. ఒక గొప్ప వ్యక్తిని గౌరవిస్తూ వారు తమ పెళ్లి కార్డుపై ముద్రించిన తీరుకు ప్రజలు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లైకులు,షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం, రాజ్యాంగం మనకు కల్పించిన అవకాశాలు, హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని కూడా సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..