Viral Video: అట్టుంటది అన్నదాతతోని.. పంటను కాపాడుకునేందుకు సూపర్ ఐడియా..
సాధారణంగా నిత్యం సోషల్ మీడియాలో వినూత్న ఆకర్షణలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వ్యవసాయాన్ని టెక్నాలజీతో జోడించడం.. దాంతోపాటు పలు కష్టమైన పనులను సైతం సులువుగా చేసేలా కొంతమంది వినూత్న ఆవిష్కరణలను రూపొందిస్తుంటారు.
Desi Jugaad Viral Video: జుగాడ్ విషయంలో భారతీయులకు అస్సలు సాటి లేదు.. పోటీ లేదు.. దేశంలో వినూత్న ఆవిష్కరణలతో ఎందరినో మెప్పించిన వ్యక్తులు చాలామందే ఉన్నారు. వీరి దేశీ జుగాడ్‌కు దేశంతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు లభిస్తుంటాయి. తాజాగా.. దేశీ జుగాడ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిలో పంటను కాపాడేందుకు రైతు చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా నిత్యం సోషల్ మీడియాలో వినూత్న ఆకర్షణలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వ్యవసాయాన్ని టెక్నాలజీతో జోడించడం.. దాంతోపాటు పలు కష్టమైన పనులను సైతం సులువుగా చేసేలా కొంతమంది వినూత్న ఆవిష్కరణలను రూపొందిస్తుంటారు. అలా చాలామంది రాత్రిరాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిన వారున్నారు. సాధారణంగా రైతులకు అతిపెద్ద సమస్య.. పక్షుల బారి నుంచి పంటలను కాపాడుకోవడం. అటువంటి పరిస్థితిలో.. ఒక రైతు దాని కోసం ప్రత్యేకమైన జుగాడ్‌ను ఆవిష్కరించాడాడు. దీంతో పక్షులు ఆ పొలం వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు.
వైరల్ వీడియోలో.. ఓ స్తంభానికి ఒకవైపు ఫ్యాన్.. మరోవైపు సిల్వర్ గిన్నెను ఏర్పాటు చేశారు. అయితే.. ఫ్యాన్ గాలికి తిరిగాలా.. రంధ్రం చేసి దానికి.. ఓ వైర్ సహాయంతో చిన్నపాటి కడ్డీని అమర్చాడు. ఫ్యాన్ గాలికి తిరుగుతుంటే.. ఆ కడ్డీ కూడా తిరుగుతుంటుంది.. అది.. గిన్నెకు తాకినప్పుడల్లా.. టన్ అంటూ శబ్ధం వస్తుంది. ఇలా బోల్టుల సాయంతో ఫ్యాన్‌ను బిగించి రైతు ఈ జుగాడ్ ను ఆవిష్కరించాడు. పక్షులను పొలాలకు దూరంగా ఉంచేందుకు రైతు చేసిన ఈ అపూర్వ ప్రయోగం అందరిని ఆకట్టుకుంటోంది.
వైరల్ వీడియో..
View this post on Instagram
ఈ దేశీ జుగాడ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో techzexpress అనే యూజర్ షేర్ చేసింది. దీనిని ఇప్పటివరకు 18 మిలియన్లకు పైగా వీక్షణలు రాగా.. 3 లక్షల 20 వేల మందికి పైగా వీడియోను చూశారు. దీంతో పాటు రైతు జుగాడ్‌ను ప్రశంసిస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: