Viral Video: పాప కోరిక.. నింజా స్టైల్‌లో దండను విసిరిన మంత్రి.. వైరలవుతున్న వీడియో..

|

Feb 11, 2022 | 9:12 PM

Viral Video: యావత్ దేశం ఫోకస్ ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో..

Viral Video: పాప కోరిక.. నింజా స్టైల్‌లో దండను విసిరిన మంత్రి.. వైరలవుతున్న వీడియో..
Follow us on

Viral Video: యావత్ దేశం ఫోకస్ ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఎన్నికల తీరుతెన్నులు, ప్రచారపర్వంపై అందరి దృష్టి నెలకొని ఉంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టాలంటే యూపీనే కీలకం. దాంతో ఆ పార్టీలన్నీ యూపీపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. పోటాపోటీగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునే హామీలతో పాటు.. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే వాక్బాణాలనూ వదులుతున్నారు. యూపీలో ఇప్పటికే మొదటి దశల పోలింగ్ పూర్తయ్యింది.

వైరల్ అవుతున్న వీడియో..
ఇదిలాఉంటే.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి ఓ పాపకు పూలమాలను పర్‌ఫెక్ట్‌గా విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 50 అడుగుల దూరంలో ఓ పాప ఓ ఇంటి డాబా పై నుంచి ర్యాలీని చూస్తోంది. ఆ పాపను చూసిన మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దండ కావాలా అని సైగ చేశారు. కావాలని ఆ పాప కోరడంతో.. ఆయన దాన్ని నింజా స్టైల్ లో విసిరారు. అంతే ఆ దండ సరిగ్గా పాప దగ్గరకు వెళ్లింది. పాప దాన్ని క్యాచ్ పట్టింది. తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను పోస్ట్ చేసిన మంత్రి… ‘‘జోష్ ఎలా ఉంది.. ఎలా విసిరాను’’ అంటూ నెటిజన్లను కోరుతూ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. దీనికి స్పందించిన పలువురు నెటిజన్లు.. నింజా స్టైల్‌ సూపర్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

జపాన్ నింజా స్టైల్ ను ఫాలో అయ్యేవారు చాలా వేగంగా స్పందిస్తారు. ఏం చేసినా స్టైలిష్ గా ఉంటుంది. ఇక్కడ మంత్రి కూడా దండను మామూలుగా విసిరితే… బరువు తక్కువగా ఉండటం వల్ల అది కొద్ది దూరం మాత్రమే గాల్లో వెళ్లి కిందపడేది. ఆయన సైడ్ నుంచి పైకి దూసుకెళ్లేలా విసిరడంతో పాపకు చేరింది. దాంతో నెటిజన్లు నింజా స్టైల్‌లో విసిరారు అంటూ కితాబిస్తున్నారు.

Also read:

Google Jobs: కిస్మత్ అంటే ఈమెదే.. 50 ఇంట‌ర్వ్యూల‌లో ఫెయిల్.. చివ‌ర‌కు రూ. కోటి ప్యాకేజీతో జాబ్ కొట్టింది..!

Knowledge: అధిక బరువున్నవారికి పరిశోధకుల హెచ్చరిక! షాకింగ్‌ విషయాలు వెల్లడి..

IPL 2022 Auction: ఈ 5గురి కోసం ముంబై ఎదురుచూపులు.. లిస్టులో u19 ప్లేయర్ కూడా?