Viral Photo: వీరోచిత పోరులో మంచులో మంచుగా మారిన వీరుడు.. ఎక్కడున్నాడో కనిపెడితే మీరు తోపులే..

|

Jan 20, 2023 | 12:10 PM

రష్యా - ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రష్యా ఏడాది క్రితం ఉక్రెయిన్‌లో తన సైనిక చర్యలను ప్రారంభించింది.

Viral Photo: వీరోచిత పోరులో మంచులో మంచుగా మారిన వీరుడు.. ఎక్కడున్నాడో కనిపెడితే మీరు తోపులే..
Ukraine Military
Follow us on

రష్యా – ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రష్యా ఏడాది క్రితం ఉక్రెయిన్‌లో తన సైనిక చర్యలను ప్రారంభించింది. దీంతో వేలాది మంది ప్రజలు మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా మంది తమ ఇళ్లను వదిలి పారిపోగా.. పెంపుడు జంతువులు చనిపోయాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇరు వైపులా భారీగా సైనిక నష్టం జరిగింది. సైనికులు సైతం వేలాది మంది మరణించారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మంచుతో కూడిన క్లిష్ట పరిస్థితులలో ఇరు దేశాల సైనికులు పోరాటం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధానికి సంబంధించిన అనేక కథనాలు, ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మానవతా సంక్షోభాల మధ్య, మంచులో ఉన్న ఉక్రేనియన్ స్నిపర్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఉక్రేనియన్ నేషనల్ గార్డ్ మంగళవారం పలు చిత్రాలను పజిల్ రూపంలో పంచుకుంది. ఈ చిత్రాలలో దాగున్న స్నిపర్‌లను గుర్తించమంటూ సవాలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఓ వైపు విపరీతమైన మంచు కురుస్తుండగా.. మరోవైపు సైనికుల తమ పోరాటంలో నిమగ్నమై ఉన్నారు. మంచుతో దుప్పటి పరుచుకుని ఉన్న ఈ ఫొటోలో చెట్లు, పొదల మాటున ఒక షూటర్ దాగున్నాడని పేర్కొంది. స్నిపర్‌లు గడ్డి, చెట్లు, పొదలు వంటి మాటున ఉండి.. యుద్ధం చేస్తుంటారు.

పూర్తిగా మంచుతో కప్పుకుని ఉన్న ఓ ప్రాంతంలో ఒక స్నిపర్ తన విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్నాడంటూ మూడు ఫోటోలను ఉక్రేనియన్ నేషనల్ గార్డ్ పోస్ట్ చేసింది. ఇది సైనికుల కఠినమైన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుందని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిత్రాల్లో దాగున్న సైనికుడిని గుర్తించండి..

ఈ ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే షూటర్ తప్పనిసరిగా కనిపిస్తాడు.

Ukraine Military

ఇప్పటికీ మీరు సైకికుడిని గుర్తించలేకపోతే.. ఈ కింద ఇచ్చిన ఫొటోను చూడండి.

Ukraine Military Pic

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..