Rent My Handy Husband: గత కొన్నేళ్లుగా ప్రపంచంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరగడం వల్ల పేదవారు మరింత పేదవారుగా మారి.. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక మధ్యతరగతి కుటుంబం కూడా తన ఆదాయ వ్యయాల మధ్య సమన్వయం చేసుకుంటూ.. జీవితాన్ని గడపడం చాలా కష్టంగా ఉంది. ఇది వాస్తవంగా ద్రవ్యోల్బణం వ్యాప్తి.. దీర్ఘకాలిక పరిస్థితులను మెరుగుపరచడానికి బదులుగా ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఏ స్టేజ్ లో ఉందంటే.. ప్రజలు తమ ఇంటిని నడపడానికి తమ ఉద్యోగంతో పాటు ఇతర పనులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఓ మహిళ గురించి చర్చ జరుగుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా సంపాదన కోసం భర్తకు అద్దె ఇవ్వడం ప్రారంభించింది.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లారా అనే మహిళ తన 41 ఏళ్ల భర్త జేమ్స్ ను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం సదరు మహిళ సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. తన భర్తను అద్దెకు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. పాడ్‌కాస్ట్ ద్వారా ఆమెకు ఈ ఆలోచన వచ్చింది. ఇటీవల తన భర్తను అద్దెకు ఇస్తున్నట్లు ప్రకటించింది. అందుకు చాలా ముఖ్యాంశాలను పేర్కొంది. భర్తను అద్దెకు ఇచ్చే పనిని ముందుకు తీసుకెళ్లడానికి.. ఒక వెబ్‌సైట్ ప్రారంభించింది. దానికి హైర్ మై హ్యాండీ హబ్బీ అని పేరు పెట్టింది. రోజుకు 35 పౌడ్లు.. అంటే మన దేశ కరెన్సీలో UKలో కేవలం రూ. 3365కి అద్దెను తీసుకుంటుంది
భర్తను అద్దెకు ఎందుకు ఇస్తుందంటే..
లారా భర్త మంచి పని నేర్పరి. స్వయంగా ఇంటి పనులు చేయడానికి ఇష్టపడతాడు. తన పాత ఇంటిని అందంగా అలంకరించి చాలా ప్రత్యేకంగా కనిపించేలా చేశాడు. జేమ్స్, డూ-ఇట్-యువర్‌సెల్ఫ్ ప్రాజెక్ట్‌లలో నిపుణుడు. అతని సామర్థ్యాలకు వారి ఇల్లు ఒక ప్రధాన ఉదాహరణ. కస్టమ్ బెడ్‌లను నిర్మించి జేమ్స్ వారి బకింగ్‌హామ్‌షైర్ ఇంటిని అందంగా మార్చారు. డైనింగ్ టేబుల్ కూడా నిర్మించాడు. పెయింటింగ్, అలంకరణ, టైల్ వేయడం , కార్పెట్ ఇన్‌స్టాలేషన్‌లో కూడా నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఇంటిపని ఏదైనా చేయడంలో నేర్పరి. ఇక జేమ్స్ తోట పనులను చేయడంలో మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు. జేమ్స్ లో ఉన్న ఈ కళ ద్వారా లారా ఇంటి ఆదాయాన్ని పెంచాలనుకుంది.
లారా ఆదాయం కోసం భర్తను అద్దెకు ఇవ్వడం అనే కాన్సెప్ట్ ను ప్రజలు చాలా ఇష్టపడ్డారు. తమకు చాలా ఆసక్తిగా అనిపించిందని అంటున్నారు. అయితే జేమ్స్‌ను (లైంగిక సేవ) కోసం అద్దెకు ఇస్తున్నామోనని చాలా మంది భావించారు. అయితే ఇలా అస్సలు కాదు.. జేమ్స్ లో ఉన్న పని చేసే టాలెంట్‌ని ఉపయోగించుకుని ఈ కొత్త పని ద్వారా ఇంటి ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నానని లారా స్పష్టం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..