Viral News: మరీ సన్నంగా ఉండడమే ఇతని సమస్య.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్.. స్ట్రిక్ట్‌ రూల్స్ అమలు

|

Mar 02, 2024 | 9:31 AM

కుటుంబంలోని సభ్యుల్లో ఎక్కువ మంది స్థూలకాయంతో బాధపడే పరిస్థితి నెలకొంది. ఈ సమస్య చాలా పెద్దది, ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని కోరుకుంటారు.. తద్వారా వారు ఏదో ఒకవిధంగా ఫిట్‌గా మారే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ఫిట్‌నెస్ మీకు సమస్యగా మారితే ? వింతగా అనిపిస్తుందా? అవును.. ఓ వ్యక్తీ సన్నంగా ఉన్నందుకు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

Viral News: మరీ సన్నంగా ఉండడమే ఇతని సమస్య.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్.. స్ట్రిక్ట్‌ రూల్స్ అమలు
Uk Man Gets Driving License Canceled
Image Credit source: pixabay
Follow us on

ఆధునిక యుగంలో మానవ జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడం,, తినే ఆహారంలో మార్పులతో శరీరం పని తీరులో కూడా అనేక మార్పులు వచ్చాయి. దీంతో మన జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయి, ఎంతగా మారిపోయింది అంటే ఇప్పుడు నీరు తాగాలన్నా శరీరానికి నెయ్యిలా అనిపిస్తుంది. కుటుంబంలోని సభ్యుల్లో ఎక్కువ మంది స్థూలకాయంతో బాధపడే పరిస్థితి నెలకొంది. ఈ సమస్య చాలా పెద్దది, ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని కోరుకుంటారు.. తద్వారా వారు ఏదో ఒకవిధంగా ఫిట్‌గా మారే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ఫిట్‌నెస్ మీకు సమస్యగా మారితే ? వింతగా అనిపిస్తుందా? అవును.. ఓ వ్యక్తీ సన్నంగా ఉన్నందుకు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

ఆంగ్ల వెబ్‌సైట్ మిర్రర్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఈ సంఘటన బ్రిటన్ నివాసి జో రోజర్స్‌ విషయంలో జరిగింది. నిజానికి అతను చాలా సన్నబడ్డాడు.. దీంతో అతను డ్రైవింగ్‌కు అనర్హుడని ప్రకటించి అతని లైసెన్స్‌ను తొలగించారు. ఏమిటి సన్నంగా ఉండడం కూడా ఒక ప్రాబ్లెమ్ ఇది ఎలా.. ఈ మాత్రానికే లైసెన్స్ ని తొలగిస్తారు అనే ప్రశ్న ప్రతి వ్యక్తీ మదిలో తలెత్తుతుంది? నిజానికి అతనికి అనోరెక్సియా అనే తినే రుగ్మత ఉంది. దీనివల్ల తన బరువు పెరుగుతుందని ఎప్పుడూ భయపడేవాడు. దీని కారణంగా అతను తినడం కూడా మానేషాడు. చాలా సార్లు ఆహారం తిన్న తర్వాత కూడా వాంతులు చేసుకుంటాడు.

ఇదంతా ఎందుకు, ఎలా జరిగిందంటే

రోజర్స్ ఈ అలవాటు కారణంగా, అతని బరువు తగ్గుతూనే ఉంది, దీని ఫలితంగా UK రవాణా శాఖ కారు డ్రైవ్ చెయ్యడానికి అనర్హుడని ప్రకటించింది. ఏ విధంగానూ డ్రైవింగ్ చేయలేని విధంగా అతనిపై పూర్తి నిషేధం విధించింది. అంతే కాకుండా ముందుగా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని.. అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందని కట్టుదిట్టమైన ఆదేశాలు ఇచ్చారు. లేకుంటే జీవితంలో కారు నడపలేడు.

ఇవి కూడా చదవండి

రవాణా శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూ.. రోజర్స్ స్వయంగా ఆసుపత్రిలో చేరాడు. చికిత్స తీసుకున్న తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది. మీడియాతో రోజర్స్ మాట్లాడుతూ.. తనకు ఉన్న అనోరెక్సియా వ్యాధి గురించి ముందుగా తన అమ్మకు తెలిసిందని.. అప్పటి నుంచి తన ఫుడ్ డైట్ ఛార్జ్ మారిపోయిందని చెప్పాడు. అమ్మ పర్యవేక్షణలో తాను తినే విధానం మారిపోవడమే కాదు.. ఎంతో సహయం కూడా అయింది. తన బరువు నియంత్రణలోకి రావడం ప్రారంభమైందని చెప్పారు. ఇప్పుడు శరీరం కోలుకోవడం వెనుక వైద్యుల కృషి కూడా ఉందని వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..