Uber Driver : ఈ మధ్య చాలా మంది ఉబర్, ఓలా క్యాబ్‌లు బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. అయితే క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ క్యాబ్ మనల్ని పికప్ చేసే పాయింట్‌కి రీచ్ కాకపోతే వెంటనే డ్రైవర్‌కి కాల్ చేసి అడుగుతాం. కానీ కొంతమంది డ్రైవర్లు ప్రయాణికులతో మాట్లాడలేని వైకల్యంతో బాధపడే వాళ్లు ఉంటారని మనకు తెలియదు. అచ్చం అలాంటి పరిస్థతిలో లండన్‌కి చెందిన ఉబర్ డ్రైవర్ ఓనూర్ ఉన్నాడు.
లండన్‌కి చెందిన ఓ వ్యక్తి ఉబర్ క్యాబ్‌ని బుక్ చేసుకుని ఎక్కుతున్నప్పుడు ఆ ఉబర్ డ్రైవర్ సీటుకి వెనుకవైపు ఉన్న ఒక చక్కటి సందేశంతో కూడిన లెటర్‌ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆ లెటర్‌లోని సందేశం ఏమిటంటే ” నేను చెవిటివాడిని కాబట్టి మీరు నాకు ఏదైనా చెప్పవలసి వస్తే, దయచేసి ఫోన్‌లో టెక్స్ట్ చేయండి లేదా నేను కారు ఆపినప్పుడు నాకు చూపించడానికి మీరు నోట్‌ప్యాడ్‌లో వ్రాయవచ్చు. మీరు మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడానికి కేబుల్‌ని ఉపయోగించవచ్చు. ఏం కావాలన్నా బాస్‌లా అడగండి చేస్తాను. ఈ ట్రిప్‌ని నేను కూడా మీతోపాటు ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. అంతేకాదు మీరు నాతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు.” అని ఉంది. దీంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి తను ఇప్పటిదాకా ఎక్కిన ఉబెర్ క్యాబ్‌ల కంటే ఈ క్యాబ్ తనకు ప్రత్యేకం అన్నాడు.
ఈ మేరకు ఆ వ్యక్తి ఈ ఉబర్ డ్రైవర్ సందేశంతోపాటు ఓనూర్ గ్రేట్ హిరో అంటూ ట్యాగ్‌లైన జోడించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్ల ఈ సందేశం ఎంత స్వీట్‌గా హృదయాన్ని తాకేలా ఉందంటూ ట్వీట్ చేస్తున్నారు.
I have just entered the most wholesome Uber of my entire life. Big ups, Onur, absolute hero ❤️ pic.twitter.com/lID9Mn7pqF
— Jeremy Abbott (@Funster_) October 21, 2021
Also read:
Digital Gold: డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. పూర్తి వివరాలు మీకోసం..
Viral News: ఫోన్‌లో ఆడుతూ ఊహించని పని చేసిన చిన్నారి.. అది చూసి షాక్ అయిన తల్లింద్రుడులు..