
ఎత్తైన భవనాలు, అద్దంలా మెరిసేపోయే వీధులు, ఆధునిక జీవనశైలితో దుబాయ్ అత్యంత అధునాతన నగరంగా ప్రసిద్ధి. కంటికి కనిపించేంత దూరం వరకు ఎక్కడా మురికి, చెత్తా చెదారం అనే ఆనవాలు కూడా కనిపించదు. ఇసుక ఎడారి ప్రాంతం నుండి ప్రపంచ వ్యాపార, విలావంతమైన నగరం దుబాయ్. అక్కడి అందాలు, అద్భుతమైన ఆకాశ హర్మ్యాలు ప్రతియేటా లక్షలాది మంది భారతీయులను ఆకర్షిస్తుంది దుబాయ్. కానీ,ఇప్పుడు దుబాయ్ నగరం దోమల బెడదతో బెంబేలెత్తిపోతోంది. పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. దుబాయ్ ప్రభుత్వం దోమల హెచ్చరికను జారీ చేయాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ప్రజల జీవనశైలి, పారిశుధ్యం నుండి ఆరోగ్యం, రవాణా వరకు దుబాయ్‌లో ప్రతిదీ ఎంతో చక్కగా, పరిశుభ్రంగా నిర్వహించబడింది. అయినప్పటికీ అక్కడ పెరుగుతున్న దోమల ముప్పు పట్ల యుఎఇ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది. దోమల జనాభా ఈ రేటుతో పెరుగుతూ ఉంటే, వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని యుఎఇ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అందువల్ల దోమలను అరికట్టడం చాలా ముఖ్యం అని ప్రకటించింది.
నివేదిక ప్రకారం.. దోమల గురించి అవగాహన పెంచుతూ యుఎఇ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. దోమ కాటును విస్మరించకూడదని, వాటిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ పోస్ట్‌లో పేర్కొంది. జ్వరం, తలనొప్పి, నిరంతర ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దోమ కాటు తీవ్రమైన చికాకు కలిగిస్తే, జాగ్రత్త వహించాలి. వ్యక్తిగత సంరక్షణతో పాటు, దోమల నివారణపై దృష్టి పెట్టాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఎక్కువసేపు ఒకే చోట నీటిని నిల్వ చేయవద్దని, దానిని క్రమం తప్పకుండా మార్చాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన చర్యలను అనుసరించడం ద్వారా దోమల పెంపకాన్ని నిరోధించాలని సూచించింది.
ఆసక్తికరంగా, UAE వంటి దేశాలు దోమలతో పోరాడుతుండగా, ప్రపంచంలో దోమలు కనిపించని ఏకైక దేశం ఐస్లాండ్. సరస్సులు, చెరువులు ఉన్నప్పటికీ ఇక్కడ దోమలు, సంతానోత్పత్తి చేయవు. అయితే పొరుగు దేశాలలో ఇవి సర్వసాధారణం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..