AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది విన్నారా.. విదేశాలకు వెళ్లేందుకు గద్దకు పాస్‌పోర్ట్‌ మంజూరు చేసిన దేశం!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ధనవంతులు తమ పెంపుడు జంతువులను విలాసవంతంగా పెంచుతారు. తాజాగా, ఒక యూఏఈ నివాసి తన గద్దకు పాస్‌పోర్ట్ పొంది, మొరాకోకు ప్రయాణించాడు. అబుదాబి విమానాశ్రయంలో ఈ దృశ్యాన్ని చూసిన ఒక పర్యాటకుడు ఆశ్చర్యపోయాడు. గద్దలకు పాస్‌పోర్ట్‌లు లభ్యమవడం యూఏఈలోని విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తుంది.

ఇది విన్నారా.. విదేశాలకు వెళ్లేందుకు గద్దకు పాస్‌పోర్ట్‌ మంజూరు చేసిన దేశం!
Uae Falcon Passport
SN Pasha
|

Updated on: May 03, 2025 | 6:37 PM

Share

అరబ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని సంపన్నలు విలాసవంతమైన జీవనశైలి ప్రసిద్ధి. అదే విధంగా వారి పెంపుడు జంతువులను కూడా లగ్జరీగా పెంచుతుంటారు. వాటి యజమానుల మాదిరిగానే ఆయా పెంపుడు జంతువులు కూడా విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తాయి. చాలా మంది అరబ్‌ షేకులు గద్దలను పెంచుకుంటూ ఉంటారు. గద్దలతో అరబ్‌ షేక్‌ ఫోటోలను వీడియోలను మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో చూసే ఉంటారు. అయితే తాజాగా యూఏఈ ఒక గద్దకు పాస్‌పోర్ట్‌ మంజూరు చేసింది.

ఒక యుఏఈ వ్యక్తి తన పెంపుడు గద్దకు పాస్‌పోర్ట్ తీసుకొని మొరాకో పర్యటనకు తీసుకెళ్లాడు. అబుదాబి విమానాశ్రయంలో యూఏఈలోని స్థానిక నివాసి చేతిలో గద్ద పట్టుకుని ఉండటాన్ని ఒక విదేశీ పర్యాటకుడు చూసి అతని దగ్గరికి వచ్చి, “ఈ గద్ద మీతో పాటు విమానంలో వస్తుందా?” అని అడిగాడు. గద్దకు పాస్‌పోర్ట్ ఉందా? అని అడిగాడు. “అవును, గద్దకు కూడా పాస్‌పోర్ట్ ఉంటుంది” అని ఆ వ్యక్తి చెప్పడమే కాకుండా.. ఆ పాస్‌పోర్ట్‌ను ప్రశ్న అడిగిన వ్యక్తికి చూపించాడు. ఆ పాస్‌ పోర్ట్‌ చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఈ వీడియో uaefalcons_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై షేర్‌ అయింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి