రోజు రోజుకీ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే..మనిషిలోని మానవత్వం మాయమైపోతుంది అని అనిపిస్తుంది ఎవరికైనా.. ముఖ్యంగా తమ దగ్గర యాక్సిడెంట్ జరిగితే.. సాయం చేయడం మానేసి.. వీడియో తీయడంలో బిజీగా ఉండేవారు కొందరు.. తమకు ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటూ చూసి చూడనట్లు తప్పించుకుని వెళ్లేవారు మరికొందరు. తాజాగా వృద్ధుడిని కొడుతున్న ఇద్దరు మహిళా పోలీసుల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వృద్ధుని తనని కొట్టవద్దంటూ అడ్డు చెబుతున్నది చూసిన వారి హృదయాన్ని కదిలిస్తుంది. వీరు అసలు మనుషులేనా అని పిస్తుంది ఎవరికైనా.. ఎందుకంటే ఆ వృద్ధుడు చేసిన తప్పు ఏమిటో తెలుసా.. సైకిల్‌పై వెళుతుండగా కిందపడిపోయాడు… లేవడానికి కొంత సమయం పట్టింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులకు కోపం వచ్చింది. తమ లాఠీలకు పని చెప్పారు. ఈ దారుణ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కైమూర్ జిల్లాలో నడి రోడ్డుమీద ఓ వృద్ధుడిపై దారుణంగా దాడి చేశారు ఇద్దరు మహిళా పోలీసులు. దాడికి గురైన వృద్ధుడు పాండే అనే తెలుస్తోంది. కైమూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పోలీసులు తనని కొడుతుంటే.. దెబ్బలు తగలకుండా అడ్డుకునేందుకు పాండే ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆ మహిళా పోలీసులు జాలి అన్న పదం మరచి పలుమార్లు లాఠీలతో ఆ వృద్ధుడిని కొట్టారు. రద్దీగా ఉండే రహదారి అయినప్పటికీ పోలీసుల దాడిని ఆపేందుకుగానీ.. వృద్ధుడిని ఆదుకునేందుకుగానీ ఎవరూ ముందుకు రాలేదు. చూస్తూ తమకు ఎందుకు అన్న విధంగా ముందుకు వెళ్లారు. ఈ ఘటనపై బీహార్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
यह दो महिला सिपाही जिस बुजुर्ग का पिटायी कर रही है उनका नाम पांडेय जी है…कैमूर के एक प्राइवेट स्कूल में पिछले कई दशकों से पढ़ाते हैं… इनकी गलती सिर्फ इतनी थी की साईकिल से जा रहे थे गिर गए …उठने में थोड़ी देर हो गयी …@bihar_police इस बाबा ने अगर कोई गलती कर भी दिए होंगे pic.twitter.com/uMuxJYPctN
— Mukesh singh (@Mukesh_Journo) January 21, 2023
ఈ ఇద్దరు మహిళా పోలీసులు కొడుతున్న వృద్ధుడి పేరు పాండే జీ. గత అనేక దశాబ్దాలుగా కైమూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. అతని ఏకైక తప్పు ఏమిటంటే, అతను సైకిల్‌పై వెళుతుండగా కిందపడిపోయాడు. కిందపడిన అతను లేవడానికి కొంత సమయం పట్టింది. అక్కడ ఉన్న మహిళా పోలీసులకు కోపం వచ్చి.. ఆ వృద్ధుడిపై లాఠీలతో దాడి చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..