సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే చాలు.. కొందరు గజగజ వణికిపోతారు. అదే పాము మన దగ్గరకు వస్తే.. ఇంకేముంది గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దాన్ని చూస్తే.. మీరూ కచ్చితంగా భయపడటం ఖాయం. ఓ యువతి ఒట్టి చేతులతో రెండు భారీ విషసర్పాలను చాలా ఈజీగా పట్టేసుకుంటుంది. మరి లేట్ ఎందుకు ఆ వీడియోపై లుక్కేయండి..
వీడియో ప్రకారం.. అదొక కాలేజీ క్యాంపస్ లేదా ఓ ప్రభుత్వ కార్యాలయం కావొచ్చు. అక్కడ ఖాళీ ప్రదేశంలో రెండు భారీ విషసర్పాలు ఒకదానికి మరొకటి చుట్టుకుని ఉండగా.. దగ్గర నుంచి ఓ యువతి వాటిని గమణిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక సరైన సమయం చూసి.. దాడికి దిగినట్లుగా ఆ రెండు పాములను ఒక్కసారిగా ఒట్టి చేతులతో పట్టేసుకుంటుంది. అవి ఆమె పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించినా..
ఆ యువతి వెంబడించి మరీ.. వాటి తొకలను పట్టుకుని లాగుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఏంటక్కా.! నీ ధైర్యం’ అంటూ కొందరు కామెంట్ చేయగా.. ‘అక్కో.. అది పాము అనుకున్నావా.. పొట్లకాయ అనుకున్నావా’ అని మరికొందరు కామెంట్ చేశారు.