Twitter Trending 2021: దేశంలో ప్రచార సాధనంగా ట్విట్టర్‌.. ఈ సంవత్సరం దుమ్ములేపిన హ్యాష్‌ట్యాగ్స్‌ ఏవో తెలుసా..?

Twitter Trending Hashtags: ఆధునిక ప్రపంచంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ సామాన్యులను ఎంతగా ప్రభావితం చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ట్విట్టర్‌లో నాయకులు, ప్రముఖుల నుంచి

Twitter Trending 2021: దేశంలో ప్రచార సాధనంగా ట్విట్టర్‌.. ఈ సంవత్సరం దుమ్ములేపిన హ్యాష్‌ట్యాగ్స్‌ ఏవో తెలుసా..?
Twitter

Updated on: Dec 10, 2021 | 2:23 PM

Twitter Trending Hashtags: ఆధునిక ప్రపంచంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ సామాన్యులను ఎంతగా ప్రభావితం చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ట్విట్టర్‌లో నాయకులు, ప్రముఖుల నుంచి అధికారుల వరకు.. ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకూ అందరూ పలు విషయాలపై స్పందిస్తుంటారు. ఆసక్తికర ట్విట్లు చేస్తుంటారు. దీంతోపాటు నెటిజన్లు కొన్ని హ్యాష్‌ ట్యాగ్‌లను నెటిజన్లు ట్రెండ్‌ చేస్తుంటారు. ఆ హ్యాష్‌ ట్యాగ్‌లతో వేలు, లక్షల ట్విట్లు, రీట్విట్‌లు వస్తుంటాయి. అయితే.. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. ఈ నేపథ్యంలో ఏడాది కొన్ని హ్యాష్‌ ట్యాగ్‌లు అత్యధికంగా ట్రెండ్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ట్విట్లర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 1 నుంచి నవంబర్ 15 మధ్య, #Covid19, #FarmersProtest, #TeamIndia, #Tokyo2020, #IPL2021, #IndVEng, #Diwali, #Master, #Bitcoin #PermissionToDance అనే హ్యాష్‌ట్యాగ్‌లతో భారతదేశంలో 2021లో అత్యధికంగా ట్వీట్ చేశారు.

చాలా విషయాలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్‌ కేంద్రంగా మారుతుంది. వీటిలో కొన్ని మంచి అంశాలుంటే.. మరికొన్ని విచారకరమైనవి ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ప్రజలకు కోవిడ్-19 హెల్ప్‌లైన్‌గా ట్విట్టర్‌ మారిందని సంస్థ ప్రకటించింది. ఇంకా స్పోర్ట్స్‌, వినోదానికి సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్‌లు వైరల్‌ అయ్యాయి.

క్రికెటర్లు, వారి వ్యాఖ్యానాలు ట్విట్టర్‌లో సంచలనం సృష్టించాయి . భారతదేశంలో కోవిడ్-19 సహాయానికి తన విరాళం గురించి ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమ్మిన్స్ చేసిన (@patcummins30) ట్వీట్ అత్యధికంగా రీట్వీట్ చేశారు. బుధవారం నాటికి, ఇది 135,900 సార్లు రీట్వీట్ చేశారు. జనవరి 11న తనకు కుమార్తె పుట్టినట్లు ప్రకటించిన విరాట్ కోహ్లీ (@imVkohli) ట్వీట్‌కు 538,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. అత్యధికంగా లైక్ చేసిన ట్విట్‌ ఇదే.

కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో భారతదేశంలో ఎక్కువగా #Covid19 హ్యాష్‌ట్యాగ్‌తో సమాచారం, సహాయం ప్రజలు ట్విట్టర్‌ని ఆశ్రయించారు. చాలా మంది ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా వనరులను కనుగొనడానికి, సహాయాన్ని అర్జించడానికి, ఆక్సిజన్, హాస్పిటల్ బెడ్‌లు, వైద్య సామాగ్రి కోసం నెటిజన్లు ట్విట్లు చేశారు. దీంతోపాటు టీకాలు వేయడం ప్రారంభించిన తర్వాత కోవిడ్‌ వ్యాక్సిన్‌ హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌ అయింది.

దీంతోపాటు అత్యధికంగా ఉపయోగించిన రెండవ హ్యాష్‌ట్యాగ్‌గా రైతుల ఉద్యమం #FarmersProtest కొనసాగింది. ఇది 2020 నుంచి 2021 వరకు కొనసాగుతూనే ఉంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, పౌరులు, నిరసన తెలిపే రైతులు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వినియోగించారు. దీంతోపాటు మూడో హ్యాష్‌ట్యాగ్‌ గా #TeamIndia నిలిచింది. గబ్బాలో క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం నుంచి ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ వరకు క్రీడాస్ఫూర్తి కొనసాగింది. #IPL2021, #IndVEng హ్యాష్‌ ట్యాగ్‌ల తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాష్‌ట్యాగ్ గా #Tokyo2020 నిలిచింది. ఒలింపిక్స్ లో భారతదేశం ఏడు పతకాలను గెలుచుకుంది.

ప్రభుత్వ పరంగా అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (@narendramodi) ట్విట్ వైరల్‌ అయింది. ప్రధాని మోదీ మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పొందుతున్న చిత్రానికి అత్యధిక రీట్విట్‌లు వచ్చాయి. వ్యాపారంలో.. టాటా సన్స్ ఎయిర్ ఇండియాను సొంత చేసుకోవాడాన్ని పురస్కరించుకుని రతన్ టాటా (@RNTata2000) చేసిన ట్వీట్ వ్యాపార ప్రపంచంలో అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్‌గా నిలిచింది.

ఎంటర్టైన్‌మెంట్‌లో తమిళ నటుడు విజయ్ (@actorvijay) తన కొత్త చిత్రం బీస్ట్‌ ప్రకటన అత్యధికంగా రీట్వీట్ చేసిన ట్వీట్గా నిలిచింది. డిజిటల్ ఆస్తుల గురించి చూస్తే.. ఎక్కువగా ట్వీట్ చేయబడిన హ్యాష్‌ట్యాగ్‌లు #Bitcoin, #BSC, #Crypto, #NFT, #DeFi ఉన్నాయి.

Also Read:

Watch Video: చేతిలో బిడ్డ ఉన్నా.. కనికరం లేకుండా కొట్టాడు.. ఎస్ఐ తీరుపై సర్వత్రా విమర్శలు.. వీడియో

Viral Video: నూతన జంటను సర్‌ప్రైజ్‌ చేద్దామనుకొని బొక్కబోర్లా పడ్డాడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..