Viral Pic: ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!

|

Jul 27, 2021 | 5:35 PM

సోషల్ మీడియా ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ఫోటో అయినా, వీడియో అయినా.. ఎప్పుడూ ఏదొకటి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది...

Viral Pic: ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!
Viral Pic
Follow us on

సోషల్ మీడియా ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ఫోటో అయినా, వీడియో అయినా.. ఎప్పుడూ ఏదొకటి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక పిక్చర్ పజిల్స్ అయితే కోకొల్లలు. ‘Spot This’ అంటూ కనిపించే ప్రతీ ఫోటో నెటిజన్లకు సవాల్ విసురుతుంది. అందులో ఏముందో తెలుసుకునేందుకు సతమతమవుతుంటారు. తాజాగా అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఈ ఫోటోలో పాము ఉంది. అదెక్కడ దాగి ఉందో కనిపెట్టాలంటూ ‘స్నేక్ క్యాచర్ నార్తన్ రివర్స్’ అనే ఖాతా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇది నెల క్రిందటి పోస్ట్ అయినప్పటికీ.. ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా అందులో పాము ఎక్కడ ఉందో కనిపెట్టండి.!

ఆ ఫోటో మాత్రం ఎలాంటి ఫోటోషాప్ మేజిక్‌తో చేసింది కాదు. అభయారణ్యంలో తీసిన పిక్. గత కొద్దిరోజులుగా ఈ స్నేక్ క్యాచర్ తరచూ నెటిజన్లకు పజిల్స్ ఇస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ పాము ఎక్కడ ఉందో.? అలాగే అది ఏ జాతికి చెందినదో.? కామెంట్స్‌లో చెప్పాలంటూ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:

మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!

ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

 మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!

పాకిస్థాన్‌లో పుట్టాడు.. టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.. అరంగేట్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు!